జగన్ పై అలాంటి ఫార్ములా ప్రయోగించిన నారా లోకేష్..??

Suma Kallamadi
వైసీపీ ఓడిపోయాక జగన్ అండ్ టీమ్ చట్టపరమైన చర్యలను ఫేస్ చేయాల్సి రావచ్చు అని తెలుస్తోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు జగన్ మోహన్ రెడ్డి మెడ చుట్టూ చుట్టుకోనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఏఎన్‌ఐతో మాట్లాడిన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన, సీఎం చంద్రబాబు ఫోన్లను వైసీపీ వాళ్లు ట్యాప్ చేశారని సంచలన అలిగేషన్స్ చేశారు.  “వైసీపీ నేతలు తాము అధికారంలోకి రాలేమని తెలియగానే డాక్యుమెంటరీ సాక్ష్యాలను ధ్వంసం చేశారు. కానీ ఇంకా రుజువు ఉంది. మా ఫోన్లకు యాక్సెస్ ఉన్నందున వాటిని ట్యాప్ చేయడానికి యాంటీ నక్సల్ వింగ్, CISL ఉపయోగించారు. మా ఫోన్లను ట్యాప్ చేయడానికి పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు.' అని లోకేష్ అన్నారు.
తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని కార్యాలయాలను సీజ్ చేయాలని డైరెక్టర్ జనరల్ (డీజీ)కి సీఎం చంద్రబాబు చెప్పినట్లు లోకేష్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులను సులువుగా గుర్తించవచ్చు, పోలీసు ఉన్నతాధికారులను సరిగ్గా విచారిస్తే ఆధారాలు దొరకడం కష్టమేమీ కాదు.  రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇదే కేసును ఉపయోగించుకుని BRS అగ్ర నాయకత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి కీలకమైన సాక్ష్యాలను సంపాదించారు.
తెలంగాణలో పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. త్వరలో రాజకీయ అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే వ్యూహం అమలవుతున్నట్లు కనిపిస్తోంది. ఘోర పరాజయం తర్వాత జగన్ మోహన్ రెడ్డికి అన్ని విధాలా కష్టాలు పెరుగుతున్నాయి. లోకేష్ రేవంత్ రెడ్డి ఫార్ములానే ఉపయోగించి జగన్ ను కటకటాల వెనక్కి నెట్టే పనిలో పడ్డారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. కేసీఆర్ ఓడిపోయాక కవితా జైలు పాలయ్యారు. ఆమెను ఇప్పటిదాకా విడిపించిన వారే లేరు.
కేసీఆర్ కూడా జైలుకు వెళ్లే లాగా ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది పోలీసు అధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. బ్రాంచ్ కూడా వ్యతిరేకంగా ఎవరైనా అధికారులు సాక్ష్యం చెబుతారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడమని చెప్పినా లోకేష్ మాత్రం వైసీపీపై ప్రతీకారం తీర్చుకునే లాగానే కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: