జనసేన ఎమ్మెల్యేలకు అంత తొందరెందుకు.. ఏదో చేసేలా ఉన్నారే..??

Suma Kallamadi
2024 ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ 100% సక్సెస్ రేట్‌ సాధించే భారతీయ ఎన్నికల చరిత్రలో అద్భుతమైన రికార్డు క్రియేట్ చేసింది. దాంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ టీడీపీ, బీజేపీ పార్టీలను ఏకం చేశారు. టీడీపీ కూటమి అఖండ మెజార్టీతో ఏపీలో విజయం సాధించిందంటే దానంతటికీ పవన్ కళ్యాణ్ ఒక్కరే కారణం అని చెప్పుకోవచ్చు. పవన్ జనసేన పార్టీ పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లోనూ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆ 21 ఎమ్మెల్యేలు ప్రజలకు సేవ చేయాలని తొందర పడుతున్నారు.
 ఇప్పుడు, ఈ ప్రజాప్రతినిధులలో ఇప్పటిదాకా ఎవరూ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు. కానీ ప్రమాణం చేయకముందే, వారిలో కొందరు తమ బాధ్యతలను నిర్వర్తించడం ప్రారంభించారు. జనసేన పార్టీ మొదటి నుంచి సామాన్యుల గొంతుకగా, ప్రజల హక్కుల కోసం పాటుపడుతోంది. ప్రజలకు సేవ చేయాలని, సామాన్యుల జీవితాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో జనసైనికులు ఎన్నికల బరిలోకి దిగారు. ప్రజలు వారిని నమ్మి భారీ మెజార్టీలతో గెలిపించారు. అయితే ఆ గెలుపుని ఒక బాధ్యతగా మాత్రమే జనసేన ఎమ్మెల్యేలు చూస్తున్నారు. తమ పదవీకాలంలో ఒక్కరోజు కూడా వృధా చేయకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే చాలా మంది తమ పని ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు.
భీమవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన పులపర్తి ఆంజనేయులు రోడ్డు మరమ్మతు పనులను స్టార్ట్ చేసి ఆశ్చర్యపరిచారు. మరో జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తెనాలిలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు. ఆదివారం మున్సిపల్ కమీషనర్ తో కలసి చేయాల్సిన పనులను ప్రారంభించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ప్రజా ప్రతినిధిగా వర్క్ ప్రారంభించేశారు. ఆయన రాచర్లలో రోడ్డు నిర్మాణ పనులను స్టార్ట్ చేసినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేస్తుంది. ఇకపోతే చంద్రబాబు మంత్రివర్గంలో 3-4 మంది జనసేన ఎమ్మెల్యేలు చోటు దక్కించుకోనున్నారని వినికిడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: