టిడిపి ఫస్ట్ టార్గెట్ ఆ వైసీపీ నేతేనా..?

Divya
వైసీపీలో ఉత్తరాంధ్ర లో సీనియర్ మోస్ట్ లీడర్ గా పేరు పొందిన బోత్స సత్యనారాయణ టిడిపి కూటమి కి టార్గెట్ గా మారిపోయారు. ముఖ్యంగా టిడిపి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఈ సీనియర్ నేత మీద చాలా ఫోకస్ పెట్టాలని కూడా టిడిపి నేతలు భావించారు.. బొత్స ను ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గట్టిగానే టార్గెట్ చేయడం కూడా జరిగింది. బొత్స వల్లే ఉత్తరాంధ్రలో ఎలాంటి అభివృద్ధి కనిపించలేదని ఆయన ఎలాగైనా ఓడించాలని  ఎంతో ఆలోచించానంటూ తెలియజేశారు. సీనియర్లను దింపితే తప్ప అక్కడ బొత్స ఓడిపోరని భావించిన మొదట గంటా శ్రీనివాసరావు అనుకున్నప్పటికీ తర్వాత కళా వెంకట్రావుని రంగంలోకి దింపామంటూ తెలిపారు.. అనుకున్నట్టుగానే అక్కడ బోత్స ఓడిపోవడం జరిగింది.

ఇప్పుడు బోత్స రెండు ఏళ్ల పాటు చేసిన విద్యాశాఖలో అవినీతి మీద పెద్ద దృష్టి పెట్టాలని కూడా కూటమి భావిస్తోంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారంలో కూడా అవినీతి జరిగిందంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయంలో ఎక్కడ అవినీతి జరగలేదంటూ తెలియజేసిన బోత్స తనదైన వర్షన్ ఇస్తున్నప్పటికీ.. కూటమి మాత్రం కావాలనే ఈయనని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా చాలామంది ఉపాధ్యాయులు కూడా ఈయనకు డబ్బులు ఇచ్చినట్లుగా కూడా కూటమికి చెబుతున్నారంటు టిడిపి నేతలు తెలియజేస్తున్నారు.

సరిగ్గా ఎన్నికల సమయంలో ఉపాధ్యాయుల బదిలీ పేరిట 50 కోట్ల రూపాయల వరకు ఈయన అందుకున్నారని టిడిపి నేతలు పలు రకాల కథనాలను తెలియజేస్తున్నారు. కానీ ఈ తరహా బదిలీలు ఆపివేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడంతో ఆ బదిలీలు కూడా ఆగిపోయాయి అంట. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల ముందు బోత్స కొంతమంది అధికారులు కలిసి ఈ విధంగా దందాలకు తెర లేపారని విమర్శలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మంత్రి దగ్గర ఉండే పిఏ పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ సచివాలయంలో కొంతమంది అధికారులు అందరూ కలిసి ఇలాంటి పనిచేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఎవరు తప్పు చేశారా లేదా అనే విషయం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: