పాపం వర్మ : స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన మెగా బ్రదర్‌ ?

Veldandi Saikiran
జనసేన పార్టీ నాయకులకు వార్నింగ్‌ ఇచ్చారు మెగా బ్రదర్‌, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. వన్నెపూడి ఉదంతంపై జనసేన పార్టీ ఫోకస్ చేసింది. వన్నెపూడిలో ఇటీవలే పిఠాపురం వర్మపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై స్పందిస్తూ... సయంమనం పాటించాలని జనసేన శ్రేణులకు పార్టీ ప్రధాని కార్యదర్శి నాగబాబు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. వన్నెపూడి ఘటనపై వివరాలు సేకరిస్తున్నాం... తాటిపర్తి విషయంలో స్థానిక నాయకులు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

జన సైనికులు సంయమనం పాటించాల్సిన సమయం ఇది...పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు  జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు....తాటిపర్తి గ్రామంలో జరిగిన సంఘటన గురించి కూడా మాకు సమాచారం ఉన్నదని వివరించారు  జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఈ విషయంపై పిఠాపురం కో ఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస నేతృత్వంలోని స్థానిక నాయకులు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో కీలక భూమిక పోషిస్తున్న తరుణంలో.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో చక్క బెట్టాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని వివరించారు. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ పిఠాపురం రానున్నారని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ సంసిద్ధులై ఉన్నారని వెల్లడించారు  జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.

పిఠాపురం నియోజకవర్గంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని... సాధ్యమైనంత వరకు నేను కూడా పిఠాపురంలో అందుబాటులో ఉంటానని వెల్లడించారు. జన సైనికులు నిరంతరం ప్రజా క్షేత్రంలోనే ఉంటారు....సమస్యలేవైనా ఉంటే అందరం కూర్చొని పరిష్కారం అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుందామన్నారు. ముఖ్యంగా పిఠాపురంలో సాగు నీరు, తాగు నీరు కొరతను అధిగమించాల్సిన అవసరం ఉన్నది...డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తానమి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: