బాబు : కేబినేట్‌ లో ఆ పదవికే ఎసరు పెట్టిన పవన్‌ కళ్యాణ్‌ ?

Veldandi Saikiran

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఐదు సంవత్సరాల వైసిపి పాలనను  భూస్థాపితం చేసిన తెలుగుదేశం కూటమి... ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.  ఇందులో భాగంగానే ఈనెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజున... జనసేన,  బిజెపి అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

అయితే ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన స్నేహితులకు ఎక్కువ మంత్రి పదవులు రానున్నాయి. ఇక అటు జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు  వచ్చే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో... దుమ్ము లేపింది జనసేన పార్టీ. దీంతో ఈ ఎన్నికల్లో 21 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే ఈ ఎమ్మెల్యేలను కొద్దిమంది మాత్రమే సీనియర్లు ఉన్నారు.  దీంతో జనసేనకు మూడు మంత్రి పదవులు ఖాయమని అంటున్నారు.

ఇందులో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కొణదల  రామకృష్ణ లకు మంత్రి పదవులు కచ్చితంగా దక్కబోతున్నాయి. అయితే ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి వస్తుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా... స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

ఇండియా టుడే ఛానల్ ప్రతినిధి... పవన్ కళ్యాణ్ను... ఇదే విషయంపై ప్రశ్నించారట. దీంతో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా... పని చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు.. ఈ మీడియా సంస్థ వెల్లడించింది.  దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పక్క జనసేన నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.  అయితే డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు మరో కీలక పదవి పవన్ కళ్యాణ్ కు రాబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై మరో రెండు రోజుల్లో క్లారిటీ రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: