మోడీ 3.0 : పవన్‌ కళ్యాణ్‌ కు మోడీ షాక్‌ ?

Veldandi Saikiran
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ప్రతి ఒక్కరూ ఊహించినట్లుగానే కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోడీ ప్రభుత్వం... ఏర్పాటు కాబోతుంది. ఇవాళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో... మోడీ కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడవసారి... ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. మోడీతో పాటు 30 మంది కేంద్ర మంత్రులుగా... ప్రమాణ స్వీకారం  చేయబోతున్నారు.

 
అయితే... కేంద్ర మంత్రి పదవులలో... రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన  తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం పదిమంది కేంద్రమంత్రులు అవుతారని అందరు అంచనా వేశారు. అయితే... తెలంగాణ అలాగే ఏపీ నుంచి మొత్తం ఐదుగురు మాత్రమే కేంద్ర మంత్రులుగా... ఇవాళ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ నుంచి బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి ఫైనల్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి ఛాన్స్ వచ్చింది.

శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, కొత్తగా ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే బిజెపి సీనియర్ లీడర్ నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మ  కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇక్కడ... జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు జనసేన నేతలు... విజయం సాధించారు.  వల్లభనేని బాలశౌరి, ఉదయ్ ఇద్దరు ఎంపీలుగా గెలిచారు.

అయితే ఇందులో బాల సౌరికి కచ్చితంగా కేంద్ర మంత్రి పదవి వస్తుందని అందరూ అంటున్నారు. కానీ చివరి నిమిషంలో మోడీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. టిడిపికి రెండు పదవులు... బిజెపికి ఒక పదవి.. ఇవ్వనుంది. దీంతో జనసేన కార్యకర్తల్లో నిరాశ నెలకొంది. ఏపీలో కూటమి గెలవడానికి కారణమైన... జనసేన పార్టీకి కేంద్రమంత్రి ఇవ్వకపోవడం పై... సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. అటు పురందరేశ్వరి, సీఎం రమేష్ లకు కూడా నిరాశ ఎదురయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: