మోదీ ఆఫీస్ నుంచి టీడీపీ ఎంపీలకు ఫోన్ కాల్స్‌..??

Suma Kallamadi
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటు కానున్న కేంద్ర మంత్రివర్గం పై ఒక క్లారిటీ వచ్చేసింది. కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వాళ్లకు పీఎంఓ ఆఫీస్ నుంచి ప్రస్తుతం ఫోన్ కాల్స్ వెళ్లిపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, పీఎంఓ నుంచి ఫోన్ కాల్స్ అందుకున్న వారిలో టీడీపీ ఎంపీలు కే.రామ్‌ మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ఉన్నారు.
కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వాళ్లలో నితిన్ గడ్కరీ, శర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, జితేంద్ర సింగ్, హెచ్‌డీ కుమార స్వామి (జేడీఎస్), ప్రతాప్ రావ్ జాదవ్ (శివసేన షిండే వర్గం)లు కూడా ఉన్నారు. వీళ్లకు కూడా ఫోన్స్ వెళ్లిపోయాయి. కేంద్ర మంత్రివర్గంలో ప్లేస్‌ సంపాదించుకున్న వారందరికీ మోదీ తన నివాసంలో డ్రింక్స్ ఇచ్చారు. వీరుతో పాటు ఇంకా ఎవరెవరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిందనేది త్వరలోనే తెలియనుంది.
టీడీపీ దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి ఎర్రన్‌ నాయుడు కుమారుడైన రామ్ మోహన్ కింజరాపు వయసు కేవలం 36 ఏళ్లే. ఆ కారణంగా ఆయన మోదీ కేంద్ర మంత్రివర్గంలో అతిపిన్న వయస్కుడు కానున్నారు. ఇకపోతే పెమ్మసాని ఒక డాక్టర్ కాగా ఆయన ఈసారి ఎన్నికలలో అత్యంత సంపన్న అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. మరోవైపు రామ్‌ మోహన్ నాయుడు 2014 నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో మూడుసార్లు గెలుస్తూ వచ్చారు. ఆయన టీడీపీకి చాలా సేవలు చేశారు. పైగా కమ్మ సామాజిక వర్గం కావడంతో చంద్రబాబు ఆయనకే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం కారణంగానే టీడీపీ గెలిచింది.
ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసానికి కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేంటంటే చంద్రబాబుకు బీసీ సామాజిక వర్గం అండదండగా నిలుస్తూ వస్తోంది. ఈసారి కూడా వాళ్లు వేసిన ఓట్ల కారణంగానే బాబు భారీ మెజారిటీతో గెలవగలిగారు. కాబట్టి కృతజ్ఞత భావంతో చంద్రబాబు బీసీ నేత పెమ్మసానికి మంత్రివర్గంలో చోటు అందించారు. జూన్ 8న సాయంత్రం కర్తవ్యపథ్ లో కేంద్ర మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: