విజయంతో కూడిన సవాళ్లు : ఉద్యోగులకు ఇచ్చిన హామీల పరిస్థితి..?

FARMANULLA SHAIK
* ప్రభుత్వ ఉద్యోగులకు భరోసాగా కూటమి ప్రభుత్వం
* ఉద్యోగుల హామీ దిశగా పయనం
(అమరావతి -ఇండియా హెరాల్డ్ )
టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగో సారి సీఎం కాబోతున్నారు. పాలనపై సుధీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు ఇప్పుడు పెను సవాళ్లే ఎదురున్నాయి.గత ప్రభుత్వం విభజన హామీలు తెచ్చుకోవడంలో ఘోరంగా ఫెల్యూర్ అయ్యారనే ముద్ర వేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ డెవలప్ మెంట్ విషయంలో జగన్ ప్రభుత్వం ఏమాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. దీంతో ఆయనను ప్రజలు ఇంటికి పంపారు. ఇప్పుడు ఆ హామీలన్నీ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం, వెనుకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజీ వంటి హామీలు ఇచ్చారు.
గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలతో ఉద్యోగ ఉపాధ్యాయులు వైసీపీకి ప్రత్యర్థులుగా మారారు. గత ప్రభుత్వాలుకల్పించిన రాయితీలు, ఇతరత్రా వసతులను సైతం వైసీపీ సర్కార్ నిలిపివేసింది. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సిపిఎస్ ను అలానే వదిలేసింది. ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద బాధ్యతలు అప్పగించింది. పాఠశాలలను విలీనం చేసింది.ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. జీతాలు సక్రమంగా చెల్లించలేదు. ఇన్ని పరిణామాల క్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని భావించారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారా తమ సత్తా చాటారు ప్రభుత్వ ఉద్యోగులు.
ఎన్నికల పోలింగ్ సమయంలో ఉద్యోగులు వ్యవహరించిన తీరు చూస్తే వైసీపీ పై వారికి వ్యతిరేకత కన్నా కూడా సీఎం జగన్ పై పగ ఎక్కువగా ఉందని స్పష్టంగా తెలిసింది. తమకు వేతనాలను ఒకటవ తేదీకి ఇవ్వకపోవడం.. పిఆర్సీని తగ్గించడం.. సిపిఎస్ ను రద్దు చేయకుండా నాన్చి వ్యవహరించడం.. తాము దాచుకున్న నిధుల పైన తమకు రుణాలు రాకుండా అడ్డుకోవడం వంటివి ఉద్యోగులకు కోపాన్ని తెప్పించాయి.ఇలాంటి పరిణామాలన్నింటిని లెక్కలోకి తీసుకున్న టిడిపి అధినేత చంద్రబాబు ప్రచారంలో భాగంగాఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు.
అయితే జూన్ 12న ప్రమాణస్వీకారం తర్వాత తన మేనిఫెస్టోలోని పథకాలను వరుసగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే తమ గెలుపు ఈ కారణమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నటికీ మర్చిపోనని వారే లేకుంటే ప్రభుత్వ పరిపాలన అసాధ్యమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని వాళ్ళని అవహేళనగా అన్యాయంగా చూడడం మంచిది కాదని ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఐఆర్ ఇచ్చి తర్వాత పిఆర్సి ఇస్తానని అన్నారు.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఉద్యోగుల కష్టమష్టాలు తెలుసుకొని ఈరోజు కూడా మా అమ్మగారికి పెన్షన్ అనేది వస్తుందని మీ యొక్క పదవీ విరమణ అనేది మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా హ్యాపీగా ఉండేలాగా చేసే బాధ్యత నాదని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: