గోదావరి : 'రాజా'...సవాల్ సంగతేంటి..?

FARMANULLA SHAIK
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పదిహేను సంవత్సరాల తర్వాత తుని నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరేసింది. 2004లో యనమల రామకృష్ణ టీడీపీ నుండి అక్కడ గెలుపొందారు. 1983 నుంచి 2009 వరకు తుని ఎంఎల్ఏ గా రామకృష్ణుడు పనిచేశాడు. యనమల రామకృష్ణుడు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉన్నారు. 2014 మరియు 2019 ఎన్నికలలో యనమల రామకృష్ణుడి తమ్ముడైనటు కృష్ణుడిని బరిలో దించారు. కానీ కృష్ణుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలయ్యారు.అయితే 2024 ఎన్నికలలో యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్య కు టికెట్ కన్ఫామ్ చేయగా ఆమె అక్కడి నుండి పోటీ చేసి విజయం సాధించారు.అయితే గత రెండు సార్లు కూడా ఓడిపోయినా యనమల కృష్ణుడు ఈసారి టిడిపి టికెట్ తనకి రాదని తెలిసి ఆ పార్టీపై అనేక ఆరోపణలు చేసి  గుడ్బై చెప్పేసి రెండు నెలల ముందు వైసీపీలో చేరారు. అయితే ప్రస్తుతం యనమల కృష్ణుడు అలా చేయడం తమ టీడీపీ పార్టీకి బాగా కలిసి వచ్చిందని తుని నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

1983 నుంచి తుని నియోజకవర్గానికి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే అయినప్పటికీ అక్కడ చక్రం తిప్పేది మాత్రం తన సోదరుడు కృష్ణుడు మాత్రమే అని ప్రజల్లోటాక్. అయితే పార్టీ హ్యాట్రిక్ ఓటమి కారణం కృష్ణుడైననే ఆయన వైసీపీలోకి వెళ్లిన తరువాత పార్టీ యొక్క నెగిటివిటి మొత్తం తనతో పాటు వెళ్లిందని టిడిపి నేతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉన్నప్పటికీ తుని నియోజకవర్గంలో మాత్రం వైసిపి గెలుస్తుందని ధీమాతో ఉన్నారు కానీ ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలు అందరినీ షాక్ కు గురి చేశాయి.తుని నియోజకవర్గ టిడిపి కోఆర్డినేటర్ గా పార్టీ అధిష్టానం పక్కన పెట్టినప్పటి నుంచి ఎలాగైనా సరే వైసీపీలో చేరాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న దాడిశెట్టి రాజా మాత్రం ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు.చివరికి వైసీపీ పెద్దలు దాడిశెట్టి రాజాని కాంప్రమైజ్ చేయడంతో యనమల కృష్ణుడు టిడిపిలో చేరిక తప్పలేదు. అయితే తమ్ముడు టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్లడంతో యనమల రామకృష్ణుడు ఏమి మాట్లాడకపోవడం తుని నియోజకవర్గంలో చర్చనీయాంశం అయింది.

2014లో జరిగిన ఎన్నికలలో టిడిపి అభ్యర్థి కృష్ణుడిపై వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా 18573 ఓట్ల మెజార్టీతో, అలాగే 2019 ఎన్నికలలో 24016 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మెజారిటీ పరంగా ఒక్క ఓటు తగ్గిన రాజకీయాలను తప్పుకుంటానని వైసిపి మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నారు. అయితే ప్రస్తుతపు ఎన్నికల ఫలితాలలో టిడిపికి 15177 ఓట్లతో మెజారిటీ వచ్చింది.అయితే దాడిశెట్టి రాజా చెప్పినట్లుగా సవాల్ స్వీకరించి రాజకీయాల నుంచి ఎప్పుడు దూరమవుతారు తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. సవాల్ చేయడం కాదు చేసిన సవాలు నిలబెట్టుకోవడం గొప్ప అని వ్యంగ్యంగా తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా విధిగా ట్రోల్ చేస్తున్నారు.ఏదేమైనా యనమల కృష్ణుడు టిడిపి నుంచి వైసీపీకి వెళ్లడం తమ పార్టీకి భాగాన్ని కలిసి వచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: