ఎన్టీఆర్-రామోజీరావు మధ్య అపుడు అసలేం జరిగింది..?

FARMANULLA SHAIK
రామోజీ రావు పేరు చెప్తేనే తెలుగు రాష్ట్రాల్లో టక్కని గుర్తుకొచ్చేది  మీడియా సామ్రాజ్యం. దానిలో భాగమైన ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానళ్లు అంటే రెండు రాష్ట్రాల్లో వాటికీ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఆయన కృష్ణాజిల్లాలోని పెదపారుపూడిలో జన్మించిన చెరుకూరి రామయ్య కాస్తా రామోజీరావుగా మారి ఓ చిన్న యాడ్ ఏజెన్సీలో చిరుద్యోగిగా పనిచేసి, ఆ తర్వాత కఠోర శ్రమనే నమ్ముకొని అందరికి ఆదర్శంగా నిల్చారు.రామోజీరావు గ్రూప్‌లో భాగలైన ఈనాడు పత్రిక మరియు మీడియా, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ప్రియా ఫుడ్స్‌, ఉషాకిరణ్‌ మూవీస్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ, కళాంజలి, బ్రిసా షోరూమ్స్‌ వంటి అనేక సంస్థలున్నాయి.వాటి ద్వారా ఆయన తెలుగు ప్రజలలో చిరకాల గుర్తింపు సాధించారు.ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడవడంతో అనేక మంది ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు.అయితే రాజకీయాపరంగా టీడీపీపార్టీ వ్యవస్థాపక టైంలో ఆయనది కీలక పాత్ర అనే చెప్పాలి. 

ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించిన సమయంలో రామోజీరావు ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ముందుకొచ్చి పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌కు రామోజీరావు అండగా నిలిచారు. ఎన్టీఆర్ నిర్వహించిన ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో రామోజీరావు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. దానివల్లే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయ్యాను అనే సంగతి ఎన్టీఆర్ గారు అనేక సార్లు చెప్పారు.అయితే ఆ తర్వాత టీడీపీలో చోటు చేసుకున్న సంక్షోభంలో రామోజీరావు పేరుకూడా బాగా వినబడింది.అయితే అప్పట్లో ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుండి తప్పించి చంద్రబాబును సీఎం చేయడంలో రామోజీరావు మెయిన్ లీడ్ తీసుకున్నట్లు అప్పట్లో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ టైం లో చంద్రబాబుకు ఎమ్మెల్యేల సంఖ్య తగ్గినా అధిక సంఖ్యలో ఉన్నారని చూపించి మిగిలిన ఎమ్మెల్యేలను చంద్రబాబుకు అనుకూలంగా మార్చారని కూడా ఆయనపై అభియోగం ఉంది. ఇదే సమయంలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా రామోజీరావు పత్రికలో కథనాలు, కార్టూన్స్ కూడా ప్రచురించారు. అపుడు ఎన్టీఆర్ కూడా రామోజీరావుపై తీవ్రంగా విమర్శలు కూడా చేశారు. అయితే అలాంటి సంఘటనతో ఎన్టీఆర్ , రామోజీరావుల మధ్య దూరం పెరిగిందని ప్రముఖులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: