రామోజీ మృతి : జగన్‌ ను రాజేంద్రప్రసాద్ అంతమాట అన్నడేంటీ ?

Veldandi Saikiran
రామోజీ  గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించిన సంగతి తెలిసిందే. ఇవాళ వేకువ జామున రామోజీరావు మరణించారు. గుండెకు సంబంధించిన అనారోగ్యం కారణంగా రామోజీరావు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో... హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో రామోజీరావు మరణించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇక రామోజీరావు మరణ వార్త తెలియగానే... చాలామంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు రామోజీరావు మరణం పట్ల చింతిస్తున్నారు. అలాగే రామోజీరావుకు నివాళులు అర్పిస్తున్నారు. రామోజీరావు   ఆత్మకు శాంతి చేకూరాలని  భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. ఇక అటు రామోజీరావు అంతక్రియలు రేపు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో... రామోజీరావు మరణం పై టాలీవుడ్ నటుడు  రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల మా ప్రగాఢ సంతాపం తెలిపారు.

చివరి రోజుల్లో రామోజీరావును కొంతమంది దుర్మార్గులు  క్షోభ పెట్టారని ఫైర్ అయ్యారు రాజేంద్రప్రసాద్. భగవంతుడు వాళ్ళ పని చూశాడని... ఆయన అనుకున్నది సాధించి మరి చనిపోయారని రాజేంద్రప్రసాద్ తెలిపారు.  తెలుగు పత్రికారంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రామోజీరావు అని... ఆసియాలోనే అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీ నిర్మించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. రామోజీరావు ఎంచుకున్న ప్రతి రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచారని... ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.

అయితే... రామోజీ  గ్రూప్స్ అధినేత రామోజీరావు...ఇప్పటికీ మార్గదర్శి చిట్‌ ఫండ్‌ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే... కేసులో రామోజీ  గ్రూప్స్ అధినేత రామోజీరావును అరెస్ట్‌ చేయాలని జగన్‌ సర్కార్‌ అప్పట్లో భావించింది. ఆస్పత్రిలో రామోజీ  గ్రూప్స్ అధినేత రామోజీరావును కూడా అరెస్ట్‌ చేయాలని జగన్‌ సర్కార్‌ అనుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. అప్పటి విషయం గుర్తు చేస్తూ.. జగన్‌ పై పరోక్షంగా రాజేంద్ర ప్రసాద్‌ పై వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. దుర్మార్గులు  క్షోభ పెట్టారని రాజేంద్ర ప్రదేశ్‌ ఫైర్ అయినట్లు వెల్లడిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: