ఏపీ : రాష్ట్రంలో 'చెత్త' పన్ను పై ఆదేశాలు జారీ..!

FARMANULLA SHAIK
ఏపీలో కొత్త ప్రభుత్వం మరో నాలుగు రోజుల్లో కొలువుదీరనుంది. అధికారంలోకి వస్తున్న చంద్రబాబు ముందు చిక్కుముళ్లు ఎన్నో ఉన్నాయి.ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి  సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ 164 స్థానాల్లో జనసేన, బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ కూటమి సంచలన విజయం సాధించింది. ఎంపీల విషయానికొస్తే మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో 21 స్థానాలు కూటమి నెగ్గింది. ఇంతటి విజయంతో అధికారం చేపడుతున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారని ప్రజల్లో చర్చ మొదలైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బటన్‌ నొక్కడంతో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రీతిలో ప్రభుత్వ సొమ్ములు దక్కాయి. ఎన్నికల సమయంలో జగన్‌ను మించి టీడీపీ నేతృత్వంలోని కూటమి హామీలు ఇచ్చింది. ప్రజలు వాటిని చూసి కూటమికి పట్టం కట్టారుఅయితే ప్రభుత్వం పగ్గాలు చేపట్టకముందే గత ప్రభుత్వం అన్యాయంగా వాలంటీర్ల ద్వారా వసూలు చేసిన చెత్తపన్నుపై ఉక్కుపాదం మోపినట్లుగా తెలుస్తుంది.కూటమి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకటైన చెత్త పన్నురద్దుకు సంబంధించిన ఆదేశాలు తాజాగా జారీ కావటం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ ఆదేశాలు లిఖితపూర్వకంగా జారీ కాలేదు కానీ మౌఖిక ఆదేశాలు వెలువడ్డాయి.చెత్తపై పన్ను వసూలు చేసిన చెత్త ప్రభుత్వంగా జగన్ సర్కార్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.స్థానిక సంస్థల నుంచి పట్టణాలు.. నగరాల వరకు నెలకు రూ.30 నుంచి రూ.150 వరకు చెత్తపన్ను వేసి రూ.200 కోట్ల మేర ఆదాయాన్ని గత ప్రభుత్వం ఆర్జించింది.అయితే ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రం వసూలు చేయడం ఆపింది.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చెత్తపన్నును రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో భాగంగా అన్నారు.అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే తాము చెప్పిన హామీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నీ మున్సిపాలిటీలలో, అలాగే కార్పొరేషన్లలో మౌఖిక ఆదేశాలు జారిచేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: