ఢిల్లీ : మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సామాన్యులు కూడానా...?

FARMANULLA SHAIK
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. ఇటీవల గెలిచిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి శుక్రవారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన మోడీ తనను లోక్ సభ పక్షనేతగా ఎన్డీఏ మిత్రపక్షాలు ఎన్నుకున్న తీర్మానాన్ని ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మోడీ రాష్ట్రపతిని కోరారు. ఎన్డీఏ మిత్ర పక్షాల తీర్మానాన్ని పరిశీలించిన ద్రౌపది ముర్ము అనంతరం. మోడీని కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు.జూన్ 9వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు న్యూఢిల్లీలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.శుక్రవారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సమావేశంలో మోడీని పార్లమెంటరీ నేతగా ఎన్నుకుంది. దాంతో ఆయన మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమం అయింది.

హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడవసారి దేశానికి ప్రధాని అవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకారానికి నూతన పార్లమెంట్‌ నిర్మాణంలో భాగస్వాములైన శ్రామికులు, ట్రాన్సజెండర్‌లు, పారిశుద్ధ్య కార్మికులను,వైద్యులు, కళాకారులు, సాంస్కృతిక ప్రదర్శనకారులు, ప్రభాశీలులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. భారత దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.మోడీతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 290 ప్లస్ సీట్లు సాధించి హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే

'ప్రధానమంత్రి మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజకీయాల్లో చాలా మార్పులు చోటుచేసుకొన్నాయి. బలమైన దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరి సహకారాన్ని ఆయన గౌరవిస్తారు. వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే ఆహ్వానాలు పంపే రోజులు పోయాయి. మా పీఎం అట్టడుగు వర్గాల్లో వారిని కూడా వీఐపీలుగానే చూస్తారు'' అని కూటమి వర్గాలు తెలిపాయి.అలాగే వీరందరితో పాటు వివిధ దేశాధినేతలు తమకు ఆహ్వానాలు అందినట్లుగా ప్రకటించారు.వారిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌ తదితర దేశాధినేతలు హాజరయ్యే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: