ఏపీ భవిష్యత్తు : పవన్ ఎంతో కాలం పొత్తులో ఉండరు??

Suma Kallamadi
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి జరిగింది ఏమీ లేదు. అమరావతి రాజధాని కాలేదు, పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. రోడ్ల వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా కనిపించడం లేదు జగన్ సంక్షేమ పథకాలతోనే సరిపెట్టారు. రోడ్లు వంటి వాటిని వేటిని ఆయన డెవలప్ చేయలేదు. మొదట ఐదేళ్లు చంద్రబాబు హయాంలో కాస్తో కూస్తో అభివృద్ధి జరిగింది. కానీ జగన్ అప్పుడు కేంద్రం కొంచెం కూడా సహకరించలేదు. రైల్వే జోన్ కూడా రాలేదు. విశాఖపట్టాన్ని తూతూ మంత్రంగా రైల్వే జోన్ ఇచ్చారు కానీ దాని వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు భవనం ఇద్దరూ కలిసి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ఒత్తిడి పెట్టాలి. అప్పుడు గానీ నిధులు రావని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును బీజేపీ ఇద్దరినీ కలిపారు. ఇప్పుడు అతనిపైనే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు వృద్ధులకు 4వేల పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చారు. మాట చెప్పే అధికారంలోకి వచ్చారు కాబట్టి అది కూడా అమలయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైనే ఉంది.
20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి కూడా ఆయన అందిస్తానని మాటిచ్చారు. పవన్ కళ్యాణ్ ని చూసే యువత ఓట్లు వేశారు. యువతకు ఉద్యోగాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో బాబు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే పవన్ మాత్రం ఊరుకోరు. ప్రతి తల్లికి 15,000 ఇస్తానని కూడా చెప్పారు కాబట్టి అవి కూడా ఇవ్వాల్సిందే.
ఇంతకుముందు చంద్రబాబు చాలా హామీలను ఇచ్చారు కానీ వాటిలో 80-90% వరకు నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అధికారంలో ఉన్నారు. చెప్పినట్లు చేయడమే ఆయన ధ్యేయం. రాష్ట్ర ఓటర్లు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆయన ఎట్టి పరిస్థితిలోనూ దుర్వినియోగం చేసుకోరు. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని ఆయన ఆలోచన. కానీ చంద్రబాబుకు వేరే చరిత్ర ఉంది. గతంలో బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ఇంటికో ఉద్యోగం అన్నారు కానీ అవి ఏమీ నెరవేర్చలేదు. అబద్ధపు ప్రకటనలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి మాట తప్పారు. కానీ పవన్ కళ్యాణ్ ఈసారి అలా జరగనివ్వరు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు అయితే పవన్ పొత్తు నుంచి బయటికి వచ్చే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: