రామోజీ మృతికి కొద్ది గంట‌ల ముందు ఏం జ‌రిగింది...?

Veldandi Saikiran
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణించారు. శనివారం తెల్లవారుజామున లేవగానే... ఈ వార్త అందరినీ షాక్ లోకి తీసుకువెళ్లింది. మూడు రోజుల కింద తలెత్తిందట రామోజీరావుకు..! ఈ తరుణంలో... వెంటనే రామోజీరావును ఆసుపత్రికి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు. హైదరాబాద్లోని నానక్ రామ గూడ లో ఉన్న ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో... నిన్నటి నుంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
వాస్తవానికి మూడు రోజుల నుంచి... ఆయన ఇంటి వద్ద... వైద్యులు చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో... నిన్న రాత్రి... హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే పరీక్షలు చేసిన వెంటనే ఆయన గుండెకు స్టంట్స్ కూడా వేశారట. గుండెకు స్టంట్స్ వేసిన తర్వాత రామోజీరావు ఆరోగ్యం... మరింత విషమంగా మారిందట.
 ఈ తరుణంలోనే రామోజీరావును వెంటిలేటర్ పై వేశారు. దీం తో నిన్న రాత్రి 10:00 నుంచి... ఇవాళ ఉదయం వరకు ఆయన వెంటిలేటర్ పైన ఉన్నారట. అయితే వెంటిలేటర్ పైన ఉన్న రామోజీరావు శరీరం... మరింత క్షీణించిపోయిందట. అసలు ఆయన బాడీ వెంటి లేటర్ కు సపోర్ట్ చేయలేదని సమాచారం. ఇలాంటి నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున... 4.50 గంటలకు రామోజీరావు కన్నుమూశారని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
 అనంతరం రామోజీ ఫిలిం సిటీ లోని ఆయన నివాసానికి... రామోజీరావు పార్తివదేహాన్ని తరలించారు. అయితే ఉదయం నాలుగు గంటల సమయంలో రామోజీరావు మరణిస్తే... ప్రకటన మాత్రం ఉదయం 7 గంటలకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకు ఇంత లేట్ గా ప్రకటన వచ్చిందని అందరూ ఆలోచిస్తున్నారు.  రామోజీరావు మరణ వార్తను కావాలనే  లేటుగా  వెల్లడించారని చెబుతున్నారు. కాగా రామోజీరావు ప్రస్తుత వయసు 88 సంవత్సరాలు. ఆయన... చేయని వ్యాపారం లేదు. పచ్చళ్ళ నుంచి  ఈనాడు సంస్థ వరకు అన్ని... వ్యాపారాలు చేశారు రామోజీరావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: