మోడీ గెలుపుని ఓర్వలేకపోతున్న విదేశీ మీడియా!

Suma Kallamadi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవం చాలా హాట్టహాసంగా జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్, నేపాల్, మారిషస్ ప్రధానులు, శ్రీలంక అధ్యక్షుడు, భూటాన్ రాజులు, నేపాలీ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జుగ్‌నాథ్‌, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఇంకా మొదలగువారికి ఆహ్వానం అందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ ఎన్నికల విజయానికి అభినందనలు తెలిపిన తర్వాత, పైన పేర్కొన్న నాయకులకు పిఎం మోడీ ధన్యవాదాలు తెలిపిన సంగతి విదితమే.
ఇలా వివిధ దేశాల వారు, ప్రాంతాల వారు మోడీని ఆశీర్వదిస్తూ కామెంట్స్ చేస్తుంటే మరికొన్ని దేశాలవారు మాత్రం భారదేశం మీద అక్కని వెళ్లగక్కుతున్న పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా మోడీ వరుసగా మూడోసారి ఇక్కడ ఎన్నిక కావడం వారికి మింగుడు పడడం లేదు. అందుకే మోడీని డీ ఫేమ్ చేయాలని వారి మీడియాలలో పిచ్చి రాతలు రాస్తున్నారు. తాజాగా BBC వారు మోడీ వైఫల్యాల గురించి ఓ కధనం వెలువరిస్తూ.. మోడీ గెలుపు ఓ గెలుపు కాదని, కూటమి లేకపోతే ఓటమి పాలయ్యేవారని విమరిస్తూ ఓ కధనం వెలువరించారు. దానిని చూసిన బీజేపీ శ్రేణులు BBCపై మండిపడుతున్నాయి.
మోడీ గెలిచిన తరువాత కొందరు నాయకులు వరుస ట్వీట్లతో మోడీని ఆకాశానికెత్తేస్తుంటే కొందరు మాత్రం అబ్బా! మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చేశాడా? అంటూ ఏడుస్తున్నారు. భూటాన్ రాజు, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ కౌంటర్ ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌లతో సహా కొంతమంది దేశ నాయకులు మోడీకి స్వయంగా ఫోన్ చేసి విష్ చేసినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్‌కీ, నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ మరియు డజన్ల కొద్దీ ఇతర నాయకులు ఎన్‌డిఎ ఎన్నికల విజయంపై ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలపడం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: