ఏపీ: జగన్‌కు షాక్.. వైసీపీ పార్టీని వదిలేసిన నాయకులు?

Suma Kallamadi
ఒక పార్టీ సక్సెస్ సాధించాలంటే కేడర్‌, నాయకులు ఇద్దరూ కూడా చాలా మంచి కనెక్షన్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వైసీపీ పార్టీలో అలా జరగలేదు. వైసీపీ నాయకులు కేడర్‌ను పూర్తిగా వదిలేశారు. జగన్ 2014 నుంచి జాతీయ రాజకీయాలని ఎదిరించారు. ఆ సమయంలో కాంగ్రెస్ నుంచి చాలామంది కీలక నేతలు జగన్ వైపు నిలబడ్డారు. వాళ్లు 2009 నుంచి వైఎస్ కుటుంబం కోసం పనిచేస్తూ వస్తున్నారు. జగన్ సాధించిన చాలా విజయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. 2014 తర్వాత కూడా చాలా సీరియస్ గా వైసీపీ పార్టీ విజయాల కోసం పనిచేశారు.
అయితే 2019లో వీరిని కాదని బయట నుంచి వచ్చిన వాళ్లకి ఎమ్మెల్యేలు, ఎంపీల టికెట్లు ఇచ్చారు. వాళ్లు గెలిచారు, పార్టీలో స్థిరపడిపోయారు. అయితే ఇప్పటికీ వైసీపీలో సొంత పార్టీ వాళ్లు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కార్యకర్తలను సమన్వయం చేసుకోకుండా ఎవరికి వారు గ్రూపులుగా ఏర్పడి రాజకీయాలు చేశారు. వారు ఒక్క నియోజకవర్గంలో ఏకంగా 10 గ్రూపులను మైంటైన్ చేశారు. ఈ గ్రూపులన్నీ కూడా ఒకే మాట మీద లేదా అభిప్రాయం మీద ఉండకపోయేవి. దీని వల్ల మొత్తం పార్టీకి బాగా డ్యామేజ్ జరిగింది.
ఇక పవర్ లో ఉన్న నాయకులు కార్యకర్తలు గురించి అసలు పట్టించుకోలేదు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయా అని కూడా చూసుకోలేదు. పవర్ లో ఉన్నాను కాబట్టి ఏదో ఒకటి చేయాలి తర్వాత కార్యకర్తల సంగతి చూద్దాం అన్నట్లు వ్యవహరించారట. మొత్తం మీద కేడర్ను వాళ్ళు వదిలేశారు. దాని కారణంగా పార్టీ ఏం గ్రౌండ్ లెవెల్లో బాగా వీక్ అయినట్లు తెలిసింది. మీరు ఏమైనా ఈసారి జగన్ ఊహించని రిజల్ట్ ను అందుకున్నారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను తన వైపు తిప్పుకొని, పొత్తులను కుదుర్చుకొని ఈసారి కూడా మళ్లీ ఆయనే అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా కూటమి సునామీలో 100% సక్సెస్ సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: