కొడాలి నానిని కొడవలితో కోస్తామంటున్న టీడీపీ మూకలు?

Suma Kallamadi
కొడాలి నాని గురించి ఆంధ్రా ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పేరు వినగానే ఒకరకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ జనాలకు గుర్తు వస్తుంది. గత ప్రభుత్వంలో ప్రత్యర్థులపై నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడే వ్యక్తుల్లో కొడాలి ముందు వరుసలో ఉంటాడు. ఆ మాటల్లో బూతు పురాణమే ఎక్కువ. అయితే సమయం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకమని పెద్దలు చెబుతూ ఉంటారు. లేదంటే ఎక్కడైనా, ఎప్పుడైనా యాక్షన్ కి రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇపుడు ఏపీలో అదే రిపీట్ అవుతోంది.
తాజాగా ప్రతీకార చర్యల్లో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని కొడాలి నాని గతంలో పౌరుషంగా మాట్లాడాడని, ఇపుడు దమ్ముంటే తన సవాల్‌ను నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే గుడివాడ వన్‌టౌన్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే కొంతమంది టీడీపీ కార్యకర్తలు పోలీసులను తోసుకుని కొడాలి నాని ఇంటివైపు పరుగులు తీస్తూ నాని ఇంటి ఎదుట జై చంద్రబాబు అంటూ నినాదాలు చేయడం జరిగింది.
ఆ తరువాత అక్కడే టపాసులు కాలుస్తూ డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే మైక్ పట్టుకుని కొంతమంది సేమ్ టు సేమ్ కొడాలి నాని మాదిరి పరుష పదజాలం ఉపయోగించారు. కొడాలి నాని గతంలో ఏం పీక్కుంటారో పీక్కోండని అన్నాడని, అందుకే ఇపుడు తన ఇంటిముందుకొచ్చామని మాట్లాడారు. గుడివాడలో కొడాలి నానికి కౌంట్‌డౌన్ స్టార్ అయిందన్న టీడీపీ కార్యకర్తలు.. ఇది ట్రైలర్ మాత్రమేనని, ముందు ముందు జాతర చూడబోతారని హెచ్చరించారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే.. రాజకీయ సన్యానం చేస్తానని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: