జైల్లో చదువుకోవడానికి అన్ని పుస్తకాలు కోరిన కవిత..!

Pulgam Srinivas
భారతీయ రాష్ట్ర సమితి (బీ ఆర్ ఎస్) పార్టీ అధినేత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె పది సంవత్సరాలు తన తండ్రి ముఖ్య మంత్రి గా ఉన్న సమయంలో బీ ఆర్ ఎస్ పార్టీ లో అత్యంత కీలకమైన వ్యక్తి గా కొనసాగారు. అలాగే రెండు సార్లు పార్టీ అధికారం లోకి రావడానికి కూడా ఈమె తన వంతు కృషి చేసింది. ఇక కొన్ని రోజుల క్రితమే ఈమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా అరెస్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కవిత ఈ కేసులో భాగంగా జైల్ లో ఉంది.

తాజాగా ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో భాగంగా అరెస్ట్ లో ఉన్న కవిత కు మరో షాక్ తగిలింది. సి బి ఐ ఛార్జ్ షీట్ ను పరిగణ లోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు కవిత కు ఈ నెల 24 వరకు జ్యుడీషియల్ కస్టడీ ని పొడిగించింది. దానితో కవిత జైల్ లో ఉంటూ చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలి అని కోరగా కోర్టు కవిత కోరికను అంగీకరించి తనకు జైల్ లో చదువుకోవడానికి 9 పుస్తకాలు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.

ఇకపోతే భాగంగా అరెస్టు అయిన కవిత కి గత కొన్ని రోజులుగా కోర్టు వద్ద అసహనం మిగులుతూ వస్తుంది. ఈమె అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా బీ ఆర్ ఎస్ పార్టీ చాలా ఎత్తున ప్రచారాలను చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలలో అభ్యర్థులను కూడా నిలబెట్టింది. కాకపోతే బీ ఆర్ ఎస్ పార్టీ 2024 వ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క స్థానాన్ని కూడా ఈ పార్టీ గెలుచు కోలేక పోయింది. ఇలా ఈ పార్టీ కి తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ ఎదురు దెబ్బ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: