జగన్ నమ్ముకున్న 'ఐప్యాక్' ఏమన్నా ఝలక్కిచ్చిందా?

Suma Kallamadi
2019లో ఐ ప్యాక్ ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఆధ్వర్యంలో వైస్సార్సీపీ అధినేత జగన్ కోసం పని చేసిన విషయం తెలిసినదే. కట్ చేస్తే నాటి రిజల్ట్ వైసీపీకి అనుకూలంగా వచ్చింది. తరువాత జరిగిన పరిణామాల తరువాత పీకే పక్కకు తప్పుకోవడంతో ఆయన శిష్య బృందం చేతిలో ఐ ప్యాక్ నేతృత్వ బాధ్యతలు పెట్టాడు జగన్ మోహన్ రెడ్డి. దాంతో తాజా ఎన్నికల ఫలితాలలో వైసీపీ కనబడకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే వైస్సార్సీపీ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. అవును, 151 సీట్లు ఎక్కడ 11 సీట్లు ఎక్కడ? ఎంత వ్యత్యాసం? ఎక్కడ తప్పు జరిగింది? అనే అంశాలను ఇపుడు జగన్ అండ్ టీమ్ వెతకడం ఆరంభించింది.
ఈ నేపథ్యంలో ఇంతలా ప్రజా వ్యతిరేకత ఉంటే వైసీపీ నియమించుకున్న ఐ ప్యాక్ టీం ఏం పనిచేసింది? అన్న అనుమానాలు ఇపుడు జగన్ అండ్ కో కి వస్తున్నాయి. తమను నమ్ముకున్న వైసీపీకి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అందించి అలెర్ట్ చేయాల్సిన బాధ్యత ఐ ప్యాక్ కి లేదా? ఎందుకింత దగా చేసింది? అనే దిశగా ఇపుడు వారు ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. వాస్తవానికి ఏపీ గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తెలియాలనే జగన్ ఐ ప్యాక్ టీంని డబ్బులు దండిగా ఇచ్చి మరీ పెట్టుకున్నాడు. అలాంటప్పుడు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కనిపెట్టి చెప్పడంలో ఐ ప్యాక్ ఎందుకు ఫెయిల్ అయింది? లేదంటే తెలిసే మిన్నకుందా? అనే అనుమానాలు వస్తున్నాయి.
ఇకపోతే దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎమ్మెల్యేలకు క్యాడర్ తో ఇక్కడ కనెక్షన్ కట్ అయింది. అదేవిధంగా క్యాడర్ కి జనంతో కనెక్షన్ లేదు. ఈ విధంగా వైసీపీ దారం తెగిన గాలిపటంలా అయిదేళ్ల కాలం తయారయింది. అందుకే ఇలాంటి ఘోర పరాజయం చవిచూశారు అని అంటున్నారు విశ్లేషకులు. టోటల్ గా చెప్పాలీ అంటే హై కమాండ్ కి క్యాడర్ కి మధ్య ఉండాల్సిన అందమైన బంధం ఒక వంతెన లాంటి సంబంధం పూర్తిగా ఇక్కడ తెగిపోయింది. ఇక జగన్ నమ్ముకున్న ఇలాంటి ఐ ప్యాక్ సంస్థలు డబ్బులు కోసమే పనిచేశాయే తప్పితే వారికి జగన్ పై గానీ వైసీపీ ప్రభుత్వంపై గానీ ఎటువంటి అభిమానం, ప్రేమ లేదు. అందుకనే ఇలాంటి ఘోర పరాజయం చూడాల్సి వచ్చిందని విశ్లేషకుల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: