మొదలైన జనసైనికుల అరాచకం.. రెడ్డి పేరు కనపడగానే హాస్టల్ యజమానిపై దారుణం..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ 21చోట్ల పోటీ చేసి అన్నింటా గెలుపొందిన సంగతి తెలిసిందే ఆ పార్టీ పొత్తు కుదుర్చుకున్న టీడీపీ 130కి పైగా సీట్లు, బీజేపీ ఏడు దాకా సీట్లు గెలుచుకుంది. దాంతో వాళ్లు అధికారంలోకి రావడం ఖాయం అయ్యింది. ఈ భారీ విజయం వల్ల జన సైనికులు రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఇంతకుముందే బండ్లపై స్టిక్కర్లు వేయించుకొని తిరిగిన ఈ జనసేన మద్దతుదారులు ఇప్పుడు ప్రజలపై తమ ప్రతాపం చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిపై వారు దాడులు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
రీసెంట్‌గా వీళ్లు హాస్టల్ నేమ్ బోర్డుపై రెడ్డి అని ఉన్నందుకు.. హాస్టల్ యజమానిపై దాడి చేసి ఆయన చేత వారి కాళ్లు పట్టించుకున్నారట. దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. @TeluguScribe అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు. దానికి "గుంటూరులోని లక్ష్మీపురంలో హాస్టల్ పేరులో రెడ్డి అని ఉన్నందుకు యజమానిని కొట్టిన జనసైనికులు.. హాస్టల్ మీద కర్రలతో, రాళ్లతో దాడి చేసి హాస్టల్ యజమాని చేత బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్నారు. అదే కాకుండా హాస్టల్లోని అద్దాలను, పూలకుండీలను ధ్వంసం చేశారు." అని ఒక క్యాప్షన్ కూడా జోడించారు.
తోటి జర్నలిస్ట్ మిత్రుడు సుధాకర్ ఉడుముల బాధిత కుటుంబంతో మాట్లాడారు, ఆయన ద్వారా ఈ వీడియో నిజమని తెలుసుకున్నాకే వివరాలతో సహా పోస్ట్ చేయడం జరిగిందని సదరు ట్విట్టర్ యూజర్ స్పష్టం చేశారు. అయితే ఈ వీడియోలో ఉన్నది చాలా సైనికులే అని మిగతా నెటిజెన్లు కూడా కన్ఫామ్ చేస్తున్నారు. "పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా జనసైనికులు ఉన్మాదుల లాగా సోషల్ మీడియాలో మాట్లాడారు. ఇప్పుడు అతను అధికారంలోకి వచ్చాడు కాబట్టి బయట ఇలా రెచ్చిపోతున్నారు." అని కొందరు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. మరి ఇందులో ఉన్న నిజమెంతో వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: