మిత్రపక్షాలపై ఆధారపడిన బీజేపీ ప్రభుత్వం.. మోడీని విదేశాలు ఎలా చూస్తున్నాయంటే?

Suma Kallamadi
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మెజారిటీ లభించింది. మ్యాజిక్ మార్క్ 272 కంటే కొంచెం ఎక్కువ మాత్రమే మెజారిటీ వచ్చింది. బీజేపీకి సొంతంగా కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చాయి. మిత్రపక్షాలతో కలిపితే బలం 292 ఉంది. మరో 3 రోజుల్లో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే విజయంపై అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపాయి. కాగా, భారత్‌లో సంకీర్ణ ప్రభుత్వం, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రశ్నలకు అమెరికా స్పందించింది. అదే సమయంలో, భారతదేశ ఎన్నికలు మరియు మోడీ సంకీర్ణ ప్రభుత్వంతో సంబంధాలపై అమెరికా నుండి కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి, దానిపై దాని ప్రతిచర్య తెరపైకి వచ్చింది. ఇప్పటికే పలు దేశాధినేతలు మోడీకి ఫోన్ ద్వారా, ట్వీట్ చేయడం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు పార్లమెంట్‌లో సొంతంగా మెజారిటీ సాధించి మోడీ ప్రధానిగా కొనసాగారు. మిత్రపక్షాలపై ఆయన పెద్దగా ఆధార పడలేదు. అయితే ప్రస్తుతం బీహార్‌లోని జేడీయూ, ఏపీలోని టీడీపీ అడ్డం తిరిగితే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ తరుణంలో విదేశాలు మోడీని ప్రస్తుతం ఎలా చూస్తాయో అనే సందేహం ఏర్పడింది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
మోడీ మరోసారి భారత ప్రధాని కావాలని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా వంటి ఎన్నో పాశ్చాత్య దేశాలు బలంగా కోరుకున్నాయి. భారత్‌తో బలమైన సంబంధాలను ఆయా దేశాలు నెలకొల్పాయి. అయినప్పటికీ మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి మోడీ ప్రధాని కానున్నారు. గతంలో విదేశాంగ విధానంలో భారత్ వైఖరి బలంగా ఉండేది. భారత వైఖరికి అమెరికా సహా ఎన్నో దేశాలు మద్దతు పలికేవి. ప్రపంచంలో అగ్రగామి రాజ్యంగా భారత్‌ను నిలబెట్టాలని మోడీ భావించే వారు. ఏదేమైనా అమెరికా భారత్‌కు మద్దతుగా నిలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ప్రధాని మోదీకి ట్వీట్‌లో అభినందనలు తెలిపారు. మరో వైపు పాక్ మాత్రం మోడీ ప్రాబల్యం తగ్గిందని, తక్కువ మెజార్టీతో ఆయన గెలిచారని మీడియాలో ప్రచురించింది. చైనా కూడా మోడీకి శుభాకాంక్షలు తెలిపినా, ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వుతుందో తెలియని పరిస్థితి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా మోడీకి విషెస్ తెలియజేశారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి ఆ దేశంతో భారత్ మైత్రి కొనసాగుతోంది. మున్ముందు కూడా అది కొనసాగే అవకాశం ఉంది. మోడీకి మెజార్టీ తగ్గడాన్ని కొన్ని దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అయితే మోడీ మూడో సారి ప్రధాని అవ్వడంతో పాటు విదేశాంగ శాఖను కూడా తమ వద్దే ఉంచుకోనున్నారు. దీంతో గతంలో మాదిరిగానే విదేశాల్లోనూ భారత్ ప్రాధాన్యం అలాగే కొనసాగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: