బాబును కలిసేందుకు ఆ ఐపీఎస్ అధికారులకు నో పర్మిషన్..??

Suma Kallamadi

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బాబును కలిసేందుకు చాలామంది క్యూ కడుతున్నారు. కాంట్రవర్షల్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా టీడీపీ అధినేతను కలవాలని బాగా ప్రయత్నించారు. మర్యాదపూర్వక భేటీ అంటూ వారు వచ్చారు కానీ వారికి పర్మిషన్ లభించలేదు. పోలీసులు వారికి నో పర్మిషన్ అని స్పష్టంగా తెలియజేయడంతో వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఐపీఎస్ ఆఫీసర్స్‌లో సీఐడీ చీఫ్ సంజయ్ ఒకరు. ఆయన కారును కరకట్ట గేటు వద్దే పోలీసులు ఆపివేసి తిరిగి పంపించేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు రిజిస్టర్ చేయడంలో సంజయ్ కీలక పాత్ర పోషించారు.
సంజయ్ ఎన్నికల ఫలితాలు రాగానే విదేశాలకు వెళ్లాలనుకున్నారు కానీ అది కుదరలేదు. చంద్రబాబు వద్దకు వెళ్దాం అనుకున్నారు, కాగా కానిస్టేబుల్ అతనిని బయటే ఆఫ్ చేసి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పై అధికారులను ప్రశ్నించారు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడంతో వెనక్కి పంపించారు. గురువారం ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు బాబుతో మాట్లాడాలి అని చెబితే ఇప్పుడు మాట్లాడటం కుదరదు అని చెప్పి ఆయన్ని సాగనంపారు. ఎన్నికల సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో ఆంజనేయులు ఈసీ తొలగించింది. ఆంజనేయులు వైసీపీకి కొన్ని విషయాల్లో సహాయం చేశారని ఆరోపణలు వచ్చాయి.
మరో సీనియర్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. నంద్యాలలో బాబును అరెస్ట్ చేయడంలో ఈయనదే కీలక పాత్ర. వైసీపీకి ఫేవరబుల్‌గా నడుచుకున్నారని ఈయనపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కూడా బాబును కలుసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన కూడా వైసీపీ ప్రభుత్వానికి చాలా సపోర్ట్ చేశారని, వైసీపీ కోసమే అనధికారికంగా పనులు చేశారని ఆరోపణలు వచ్చాయి. వైసిపి వాళ్లకు మనతో ఏం పని అన్నట్లు ఆయన కారును గేటు వద్దే నిలిపివేశారు. అనంతరం వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని చెప్పడంతో చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: