చంద్రబాబు సంచలన నిర్ణయం...అమాంతం పెరిగిన స్టాక్స్ ?

Veldandi Saikiran

దేశ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 400 సీట్లు కొడతామన్న ఎన్డీఏ కూటమి... చతికల పడింది. సొంతంగానే 300 సీట్లకు పైగా సాధిస్తామని... బిజెపి పార్టీ నిత్యం చెప్పుకుంటూ వచ్చింది. కానీ నాలుగో తారీఖున రిలీజ్ అయిన ఫలితాలు.. మోడీ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చాయి. అయితే... జూన్ 4వ తేదీ కంటే ముందు రోజు వరకు స్టాక్ మార్కెట్లు... ఎగిసిపడ్డాయి. లాభాల్లో దూసుకువెళ్ళాయి.

ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయన్న ప్రచారంతో... జూన్ 4వ తేదీ వరకు... దుమ్ము లేపాయి స్టాక్ మార్కెట్. అయితే జూన్ 4వ తేదీ రోజున.. ఇండియా పార్లమెంట్ ఎన్నికలు రిలీజ్ అయిన నేపద్యంలో... స్టాక్ మార్కెట్లో కుప్పకూలాయి. జూన్ మూడో తేదీ వరకు స్టాక్ మార్కెట్ నిఫ్టీ 23 వేల ఆల్ టైం  రికార్డు సృష్టించగా ఆ తర్వాత అమాంతం పడిపోయింది. దీనంతటికీ కారణం కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రాకపోవడం అనే వార్త చెక్కర్లు కొట్టడం.
అయితే ఎన్నికలు మూసేసరికి బిజెపి పార్టీకి కేవలం 240 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 272 సీట్లు ఉండాలి. అయితే అలాంటి నేపథ్యంలో... జెడీయు, అలాగే తెలుగుదేశం పార్టీ కీలకమయ్యాయి. ఈ రెండు పార్టీలు... కలిస్తేనే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు అవుతుంది. ఈ నేపథ్యంలోనే.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు... కీలక ప్రకటన చేశారు.
కేంద్రంలో... ఎన్డీఏ కూటమికి తమ మద్దతు ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. మన బుధవారం వరకు... స్టాక్ మార్కెట్లో నష్టాల్లోనే ఉన్నాయి. ఇటు ఆదాని గ్రూప్ సహా ఇతర స్టాక్స్  కూడా దివాలా తీసాయి. అయితే చంద్రబాబు ప్రకటన చేసిన తర్వాత.. స్టాక్ మార్కెట్లో మళ్లీ గాడిలో పడ్డాయి. దేశవ్యాప్తంగా చంద్రబాబు ప్రకటన గురించి.. అందరూ చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ప్రకటనతోనే స్టాక్ మార్కెట్లో మళ్లీ...పుంజుకున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు ఈ వార్త దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అటు చంద్రబాబు పార్టీ అధికారంలో రావడం, ఆయన ప్రకటన కారణంగా హెరిటేజ్, అమర రాజా కంపెనీల విలువలు దూసుకెళుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: