తప్పును ఒప్పుకున్న వేణు స్వామి... మరి వీరిద్దరి సంగతేంటి..?

Pulgam Srinivas
దాదాపుగా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వచ్చాయి అంటే చాలు అనేక మంది జ్యోతిష్యవేత్తలు వారు గెలుస్తారు ..? వీలు గెలుస్తారు ..? అని తమ ప్రిడిక్షన్ ను చెపుతూ ఉంటారు. కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ప్రముఖ జ్యోతిష్యవేత్త అయినటువంటి వేణు స్వామి ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి జగన్ సీఎం అవుతాడు.

ఈయనకు భారీ స్థానంలో అసెంబ్లీ స్థానాలు దక్కుతాయి అని చెప్పుకొచ్చాడు. ఈయన ప్రిడిక్షన్ పూర్తిగా తప్పు అయింది. జగన్ పార్టీ అధికారంలోకి రావడం పక్కన పెడితే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 అసెంబ్లీ స్థానాలలో మాత్రమే ఈ పార్టీ గెలిచింది. దానితో ఆయన బహిరంగంగా ఓ వీడియోని విడుదల చేస్తూ నేను చేసిన ప్రొడక్షన్ తప్పు అయింది. మరోసారి నేను ఎన్నికలకు , సినిమాలకు సంబంధించిన జ్యోతిష్యాలు చెప్పను అని చెప్పుకున్నాడు. ఇకపోతే చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఎలక్షన్ల సమయంలో వారు ఆ పనులు చేశారు , అందుకే వారికి ప్లేస్ అవుతుంది. ఇది వీరు చేశారు.

ఇందుకే వీరికి మైనస్ అవుతుంది అని అనేక రకాలుగా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లకు ముందు , ఆ తర్వాత ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అయినటువంటి నాగేశ్వర్ , తెలకపల్లి రవి ఈ సారి వై సీ పీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని , జగన్ రెండవ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అని , అలాగే మరెన్నో కోణాలలో వైసిపి పార్టీకి తిరుగేలేదు అన్నట్లు విరు చెప్పారు. కానీ ఫలితాలు అందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి. మరి వేణు స్వామి లాగానే వీరు కూడా బహిరంగంగా తమ విశ్లేషణ తప్పు అని ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: