మాజీ కలెక్టర్లే ఏపీలో ఎమ్మెల్యేలుగా అవతరించారు... ఎవరంటే?

Suma Kallamadi
ఐదేళ్లు నైరాశ్యంలో గడిపినా నేడు బాబు ఏపీలో ఘన విజయం సాధించడంతో పాటుగా కేంద్రంలో కింగ్ మేకర్ గా అవతరించాడు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఏర్పడబోయే ఎన్డీయే కూటమిలో టీడీపీ ప్రాతినిధ్యం ఇపుడు కీలకం కావడంతో ఈ అవకాశాన్ని ఏపీ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టుగా సమాచారం. టీడీపీ అవసరం అనివార్యం కావడంతో బీజేపీ కూడా టీడీపీ విషయంలో సానుకూల ధోరణిని అవలంబించినట్టుగా కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రి పదవులను చంద్రబాబు కోరినా అందుకు మోడీ కూడా సానుకూలంగా స్పందించే అవకాశం లేకేపోలేదు. దీంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని బాబుకి చాలామంది రాజకీయ మేధావులు సూచనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే 2 కేబినెట్ మంత్రి పదవులతో పాటు మరో 2 సహాయ మంత్రి పదవులు, స్పీకర్ పదవిని ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ కేంద్రాన్ని ఒప్పించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నట్టు ప్రస్తుతంగా కనబడుతోంది. ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ వ్యతిరేకించే అవకాశం లేదు కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తితోపాటు విశాఖ ఉక్కు, రైల్వే జోన్ ను సాధించుకోవాలని చంద్రబాబు మంచి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే చంద్రబాబు సారధ్యంలో ఏపీ అభివృద్ధి బాటలో పయనించినట్టే అవుతుంది.
ఇకపొతే ఈసారి కూటమి నుండి గెలుపొందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఒకప్పుడు కలెక్టర్లుగా పనిచేసినవారు కావడం విశేషం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాలనాధికారులుగా పని చేసిన బి. రామాంజనేయులు, డి. వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందడం గమనార్హం. రామాంజనేయులు విషయానికొస్తే 2007 జూన్ 7 నుంచి 2009 జూన్ 17 వరకు ఇందూరు కలెక్టర్ గా పని చేయడం జరిగింది. కాగా అతను గుంటూరు జిల్లా ప్రత్తిపాడు(ఎస్సీ) నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా 42,015 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా డి.వరప్రసాద్ 2010 ఫిబ్రవరి 17 నుంచి 2012 జులై 30 వరకు పాలనాధికారిగా పనిచేయడం జరిగింది. ఆయన కోనసీమ జిల్లా రాజోల్(ఎస్సీ) నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి 39,011 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది మంచి శుభపరిణామం అని చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: