వర్మ: దమ్ముంటే సినిమాలు మానేసి రా...కీలక పదవి ఇస్తాం?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఐదు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిన వైసిపి పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఇక ఈ ఐదు సంవత్సరాల కాలంలో... అనేక కష్టాలు అనుభవించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో... అన్నగారు నందమూరి తారక రామారావు ముద్దుల మనవడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు బాగా వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత... జూనియర్ ఎన్టీఆర్ ను ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు తెలుగు తమ్ముళ్లు.

తెలుగుదేశం పార్టీని ... నారా లోకేష్ అలాగే చంద్రబాబు కష్టపడి... అధికారంలోకి తీసుకువచ్చారని ఇక జూనియర్ ఎన్టీఆర్ అవసరం తమకు లేదంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే పిఠాపురం నియోజకవర్గ  మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ కీలక నేత  వర్మ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరలేపాడు. జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి.. కామెంట్స్ చేశారు వర్మ. తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తాంలే అన్నట్లుగా... జూనియర్ ఎన్టీఆర్ పై సెటైర్లు పేల్చారు వర్మ.

తాజాగా వర్మ ఓ ప్రముఖ ఛానల్ పొలిటికల్ డిబేట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. దీనిపై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను సినిమాలు మానేసి.. ఫుల్ టైం రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాలని.... అప్పుడే ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తామని చురకలండించారు. నారా లోకేష్ తో జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి పోలిక లేదని ఫైర్ అయ్యారు. లోకేష్ సిన్సియర్గా పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారని.... 60 లక్షల సభ్యత్వాన్ని  సాధించడంలో నారా లోకేష్ కృషి ఉందని తెలిపారు.

పార్టీ కోసం నిత్యం కష్టపడే వాడు నారా లోకేష్ అని తెలిపారు. పార్టీలో కార్యకర్తలు మరణిస్తే ఇన్సూరెన్స్ ఇచ్చే విధానాన్ని కూడా నారా లోకేష్ తీసుకువచ్చారని వర్మ చెప్పుకొచ్చారు. అయితే పార్టీ కోసం త్యాగం చేసే ఉద్దేశం జూనియర్ ఎన్టీఆర్ కు ఉంటే... వెంటనే రాజకీయాల్లోకి రావాలని కోరారు వర్మ. తెలుగుదేశం పార్టీలో చేరి..  పార్టీ కోసం బాగా కష్టపడితే పదవులు ఇస్తామని తెలిపారు. కానీ పార్టీ కోసం కష్టపడని వారి కోసం పదవులు ఎలా ఇస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వర్మ. ఇప్పుడు వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: