జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కి రెస్పాండ్ అయిన చంద్రబాబు.. హార్ట్ టచింగ్ రిప్లై..!

lakhmi saranya
ఏపీలో కూటమి విజయంతో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ నేతలు మరియు సినీ సెలబ్రిటీలు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. కాగా గత కొద్దిరోజులుగా టిడిపి, చంద్రబాబు విషయంలో సైలెంట్ గా ఉంటూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కూటమి విజయం పై నిన్న ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. " ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రిక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. మీ ఈ విజయం ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీ సాధించిన నారా లోకేష్ కి.. మూడవసారి ఘనవిజయం సాధించిన బాబాయి బాలకృష్ణకి.. ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్ అండ్ పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు " అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు ఎన్టీఆర్.  ఇక ఈ ట్వీట్ చూసిన కూటమి అభిమానులు వీరి మధ్య ఉన్న మనస్పార్ధాలు తొలగిపోయాయి అనుకుంటా అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈ ట్వీట్ కు చంద్రబాబు స్పందించారు.
" థాంక్యూ వెరీ మచ్ అమ్మ " అని రిప్లై ఇచ్చారు. దీంతో టీడీపీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఖుషి అవుతున్నారు. తమ అభిమాన హీరో ఇన్నాళ్లకు టిడిపి విషయంలో పాజిటివ్ గా స్పందించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అభిమానులు సైతం జూనియర్ ఎన్టీఆర్ కు స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు. ప్రెసెంట్ చంద్రబాబు రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం అనంతరం వార్ 2 షూటింగ్లో పాల్గొనున్నాడు. ఇక తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా ఛాయనున్నాడు తారక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: