చక్రం తిప్పుతున్న బాబు...ఏపీ నుంచి కేంద్ర మంత్రుల జాబితా ఇదేనా?

Veldandi Saikiran

కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్‌ రాబోతుంది. జూన్ 9 (ఆదివారం) న ప్రధాన మంత్రిగా వరుసగా మోడి మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు కేంద్రంలో నూతన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం చేశారు.  కేంద్రంలో బిజేపి నేతృత్వంలో మరోసారి ఎన్.డి.ఏ కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది.  దీంతో రేపు మరోసారి ఢిల్లీకి రానున్నారట టిడిపి అధినేత చంద్రబాబు. అటు ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు.  రేపు ( జూన్ 7, శుక్రవారం) మరోసారి సమావేశం కానున్నారు ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షాల నేతలు.

రేపు సాయంత్రం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఎన్.డి.ఏ కూటమికున్న ఎంపీల సంఖ్యాబలాన్ని తెలియజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు భాగస్వామ్య పక్షాల నేతలు. ఎన్.డి.ఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకావడంలో కీలకంగా మారారు టిడిపి అధినేత చంద్రబాబు, జేడి-యు నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్. ఎన్.డి.ఏ సంకీర్ణ ప్రభుత్వం మనుగడకు రెండు కీలక భాగస్వామ్య పక్షాల మద్దతే ప్రధాన కారణం విశేషం. ప్రధానంగా 16 ఎంపీల టిడిపి, 12 ఎంపీల జేడి-యు మద్దతుతో కేంద్రంలో ఏర్పడనుంది బిజేపి నేతృత్వంలోని ఎన్.డి.ఏ సంకీర్ణ ప్రభుత్వం.  

ఇలాంటి నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అవసరాలు, కేంద్రం నుంచి ఏపీ ప్రజలు ఆశిస్తున్న సహాయం, తోడ్పాటు, కొత్తగా ఏర్పడుతున్న కేంద్ర ప్రభుత్వంలో పదవులు లాంటి అంశాలపై పియూష్ గోయల్ తో చంద్రబాబు నిన్నటి  ఢిల్లీ పర్యటనలో చర్చించినట్లు సమాచారం అందుతోంది. ఇక ఏపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు ( టిడిపి), పెమ్మసాని చంద్రశేఖర్ ( టిడిపి), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ( టిడిపి), పురందేశ్వరి (బిజేపి) , బాలశౌరి (జనసేన) లకు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
అయితే..సీఎం రమేష్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందట. ఇప్పటికే నరేంద్ర మోడి ని ఎన్.డి.ఏ కూటమి నాయకుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా నిన్నటి సమావేశంలో తీర్మానం చేశారు భాగస్వామ్య పక్షాల నేతలు. జాప్యం లేకుండా, సత్వరమే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలంటూ నిన్న జరిగిన ఎన్.డి.ఏ సమావేశంలో సూచించారు జేడి-యు అధినేత, బీహార్ సిఎమ్ నితీష్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: