కూటమి ప్రకటించిన 25 హామీలు బాబు నెరవేర్చగలిగేనా?

Suma Kallamadi
ఏపీలో కూటమి అయితే ఎవ్వరూ ఊహించని విధంగా రికార్డు స్థాయిలో గెలిచింది. ఇక తరువాత ఏమిటి? అన్న ప్రశ్న ఇపుడు ప్రతి ఒక్కరి మదిలో మొదలయ్యింది. మరీ ముఖ్యంగా బాబు ఏదైతే తన కూటమి మేనిఫెస్టోలో భాగంగా ప్రటించాడో... ఆ 25 హామీలు నెరవేర్చగలిగే పరిస్థితుల్లో రాష్ట్రం ఉందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఏపీ ఖజానా దాదాపు శూన్యం. డెవలప్ మెంట్, మౌలిక సదుపాయాల మీద భారీగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఇపుడు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయా అంశాలే ఇపుడు వైసీపీని చిత్తూ చిత్తుగా ఓడించేశాయి కాబట్టి. జగన్ అసమర్థుడని నమ్మిన ఏపీ ప్రజానీకం బాబుకి పట్టం కట్టింది.
పోలవరాన్నిపూర్తి చేయటం నుండి రాజధాని నిర్మాణంపై అడుగులు పడేలా చేయటం అంటే మాటలు కాదు.. చెప్పినంత ఈజీ కాదు. అన్నింటికి మించిన ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన పాతిక హామీల అమలు ఇప్పుడు పెద్ద సవాలుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవును, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే సరిపోదు.. ప్రజలకు ఇచ్చిన హమీల అమలు ఎలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకుంటే.. ఈ హామీలు అమలు చేయాలంటే భారీ ఎత్తున నిధులు అనేవి ఇపుడు అవసరం. బాబు అనుభవం మీద నమ్మకం పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లు భారీ స్థాయిలో బాబుని గెలిపించుకున్నారు మరి.
ఈ చారిత్రక గెలుపు వేళ.. చంద్రసేన ఇచ్చిన పాతిక హామీల్ని ఒకసారి పరిశీలిస్తే... మొదటగా 'మెగా డీఎస్సీ'పై మొదటి సంతకం చేయాల్సి ఉంది.  తరువాత వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలు, దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు, 18 ఏళ్ళు నిండిన అందరి మహిళలకు (ఒక్కొక్కరికి చొప్పున) నెలకి రూ.1500, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి నెలకి రూ.3000, తల్లికి వందనం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, రైతుకు ఏడాదికి రూ 20 వేల పెట్టుబడి, వాలంటర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10 వేలు, ఉచిత ఇసుక, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు, భూహక్కు చట్టం రద్దు, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనక్షన్, బీసీ రక్షణ చట్టం, పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదోడిని సంపన్నుల్ని చేయడం, చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్, కరెంటు చార్జీలు పెరగవు, 50 ఏళ్ళకే బీసీలకు పెన్షన్, ప్రతి పేద వాడికి, 2 సెంట్ల ఇళ్ళ స్థలం, ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్ తో మంచి ఇళ్ల నిర్మాణం, పెళ్లి కానుక కింద రూ.లక్ష, విదేశీ విద్య, ఎటువంటి కండిషన్స్ లేకుండా పండుగల వేళ కానుకలు... ఇలా ఇన్ని హామీలు నెరవేర్చడం అయితే బాబుకి కత్తిమీద సామే అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: