బాబు : చూడండి త‌మ్ముళ్లూ.. చంద్ర‌బాబు క‌ష్టం!

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా... లేదా 164 స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం కూటమి... అధికారంలోకి రాబోతుంది. అయితే... ఐదు సంవత్సరాల వైసిపి పరిపాలనను భూస్థాపితం చేయడంలో నారా చంద్రబాబు నాయుడు... కీలక పాత్ర పోషించాడు అని చెప్పవచ్చు. ఆయన వల్లనే ఇంతటి విజయం నమోదు అయింది.

 
 అయితే గత ఐదు సంవత్సరాలలో వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు... తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నో కష్టాలు పడ్డారు. రామాయణంలో రామునికి ఎంత కష్టమోందో... అంతే కష్టం.. ఏపీలో చంద్రబాబు నాయుడు అనుభవించారు. నిండు అసెంబ్లీలో... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భార్యను అవమానించారు. లోకేష్ పుట్టుకపై కూడా వైసిపి నేతలు నీచంగా మాట్లాడారు. ఆ ఎపిసోడ్ నేపథ్యంలో... మీడియా ముందు చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు.


 అయినా అక్కడితో తగ్గకుండా... మళ్లీ ముఖ్యమంత్రి స్థాయిలోనే అసెంబ్లీలో అడుగుపెడతానని... అక్కడే సవాల్ చేసి మరీ వచ్చారు. కాకుండా... ఏపీలోని తెలుగుదేశం ఆస్తులను వైసీపీ ధ్వంసం చేసింది. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ పై దాడులు చేసింది. జై టిడిపి అన్న నాయకులపై దాడులు చేపించింది వైసిపి పార్టీ. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై.. ప్రశ్నించేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి చంద్రబాబు నాయుడు వస్తే... పర్మిషన్ లేదని... ఎయిర్ పోర్ట్ ను  ఆపేసింది జగన్ సర్కార్.


 అలాగే ఎయిర్ పోర్ట్ లో చాలాసార్లు చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేశారు. చంద్రబాబును అడుగడుగునా ర్యాగింగ్ చేశారు  వైసీపీ నేతలు. ఇక స్కిల్ డెవలప్మెంట్  స్కామ్ అంటూ, రాజధాని భూముల స్కాం అంటూ... రాజమండ్రి సెంట్రల్ జైల్లో అరెస్ట్ చేసి చంద్రబాబును పెట్టారు  జగన్మోహన్ రెడ్డి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరైన వసతులు కూడా  చంద్రబాబుకు అందించలేదు జగన్ ప్రభుత్వం. కుటుంబ సభ్యులు కలుస్తారన్న కూడా... అనుమతులు ఇవ్వలేదు. ఇలా చంద్రబాబు నాయుడును అడుగడుగునా... హింసించింది వైసీపీ ప్రభుత్వం.  అయితే గాయపడ్డ సింహంలా... ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గాండ్రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: