చంద్రబాబు: మేం ఎన్డీఏలో ఉన్నాం !

Veldandi Saikiran

దేశ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా? లేదా ? అనే సందేహంలో ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తాము ఎన్డీఏ కూటమిలో ఉన్నామని ప్రకటించారు చంద్రబాబు. అందుకే ఇవాళ పవన్‌ కళ్యాణ్‌, తాను ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నామని క్లారిటీ ఇచ్చారు. కూటమి విజయం సాధించిన అనంతం చంద్రబాబు...ప్రెస్‌ మీట్‌ పెట్టారు. మీడియాకు స్వాతంత్రం వచ్చిందంటూ ప్రెస్ మీట్ మొదలు పెట్టిన చంద్రబాబు...సంచలన వ్యాఖ్యలు చేశారు.

1984, 1994ను మించిన స్థాయిలో ఇప్పుడు ప్రజల నుంచి రియాక్షన్ వచ్చిందని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజలు స్వేచ్ఛని కొల్పోయారని... అందరం కలిశాం.. ఎన్నికల్లో పోటీ చేశామని వివరించారు. కంచుకోటలు బద్దలు చేశామని.. మెజార్టీలు పెద్ద ఎత్తున వచ్చాయని వివరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ ఎన్నికలను ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కావడం లేదని... అహకారం, నియంతృత్వం, విచ్చలవిడి తత్వం వంటివి ప్రజలు సహించరని వైసీపీ పార్టీకి చురకలు అంటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
ప్రజలు గుణపాఠం నేర్పించారని... ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డామని గుర్తు చేసుకున్నారు. నిద్రలేని రాత్రులు గడిపామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జై జగన్ అనకుంటే చంపేస్తామన్నా.. లెక్క చేయకుండా జై తెలుగుదేశం అని నినాదాలు చేసిన చంద్రయ్య లాంటి కార్యకర్తలను ఎలా మరువగలమంటూ ఎమోషనల్‌ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పవనుకు స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు. విశాఖలో ఉండొద్దని పవన్ను నగర బహిష్కరణ చేసిన పరిస్థితి ఉందని ఆగ్రహించారు.

అరెస్ట్ చేసిన తర్వాత విషయాలు చెబుతామనే పరిస్థితులు అని... మేం పాలకులం కాదు సేవకులమన్నారు. మాకొచ్చింది అధికారం కాదు.. బాధ్యత అని వివరించారు. మేనిఫెస్టో.. సూపర్ సిక్స్ వంటివి ప్రజల్లోకి వెళ్లాయని... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ ముందుకొచ్చారని వివరించారు. పవనే కూటమికి బీజం వేశారన్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలు బేషజాలకు పోకుండా కలిసి పని చేశామని వెల్లడించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: