బాబు : కూటమికి బీజం వేశాడు..సెల్యూట్‌ పవన్‌ కళ్యాణ్‌ ?

Veldandi Saikiran
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కూటమి విజయంపై చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. కూటమికి బీజం వేశాడు..సెల్యూట్‌ టూ పవన్‌ కళ్యాణ్‌ అంటూ కొనియాడారు. అనంతరం మీడియాకు స్వాతంత్రం వచ్చిందంటూ ప్రెస్ మీట్ మొదలు పెట్టిన చంద్రబాబు...కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు శిరస్సు వంచి ధన్యావాదాలు చెబుతున్నానని..... గత ఐదేళ్లల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదని వెల్లడించారు. అన్ని వ్యవస్ధలను ధ్వంసం చేశారని వైసీపీ సర్కార్‌ పై ఆగ్రహించారు.
ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలనే నినాదంతో వెళ్లామని తెలిపారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి.. ఏదీ శాశ్వతం కాదని పేర్కొన్నారు చంద్రబాబు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వ్యక్తులు.. రాజకీయ పార్టీలు కనుమరుగు అవుతాయని చెప్పారు. ఎక్కడో దూర తీరాల్లో ఉన్నవాళ్లు.. కూలీ పనులు చేసుకునే వాళ్లు కష్టంతో వచ్చి ఓటేశారని కోనియాడారు. టీడీపీ చరిత్రలో.. ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలివి అంటూ పేర్కొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ ముందుకొచ్చారని... పవనే కూటమికి బీజం వేశారని కొనియాడారు. కూటమిలో ఉన్న మూడు పార్టీలు బేషజాలకు పోకుండా కలిసి పని చేశామన్నారు. 1984, 1994ను మించిన స్థాయిలో ఇప్పుడు ప్రదల నుంచి రియాక్షన్ వచ్చిందని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛని కొల్పోయారని... అందరం కలిశాం.. ఎన్నికల్లో పోటీ చేశామని స్పష్టం చేశారు చంద్రబాబు.
కంచుకోటలు బద్దలు చేశామని... మెజార్టీలు పెద్ద ఎత్తున వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కావడం లేదని... అహకారం, నియంతృత్వం, విచ్చలవిడి తత్వం వంటివి ప్రజలు సహించరని స్పష్టం చేశారు బాబు. ప్రజలు గుణపాఠం నేర్పించారు...ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డామని తెలిపారు. నిద్రలేని రాత్రులు గడిపామన్నారు బాబు. మీది మామూలు సహకారం కాదు... నేను గతంలో చాలా ఎన్నికలలో చాలాసార్లు గెలిచాను... కొన్నిసార్లు ఓడిపోయాను ఎన్నికలలో గెలిచిన తర్వాత గంతులు వేయలేదని తెలిపారు. ఎన్నికలలో ఓడిపోతే పొంగిపోలేదు... ఓడిపోయినప్పుడు కూడా బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేయాలని తెలిపారు. గెలిపించినప్పుడు ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: