తగ్గి నెగ్గడమే పవన్ విజయ రహస్యం.. రాజకీయాల్లోనూ పవర్ స్టార్ అయ్యారుగా!

Reddy P Rajasekhar
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఎన్నికల్లో గెలవడంతో పాటు తన పార్టీ నుంచి పోటీ చేసిన మిగతా అభ్యర్థులను గెలిపించుకోవడంలో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయ రహస్యం ఏంటనే ప్రశ్నకు తగ్గి నెగ్గడమే పవన్ విజయ రహస్యం అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడమే పవన్ సక్సెస్ సీక్రెట్ అని చాలామంది భావిస్తారు. కొన్ని సందర్బాల్లో ఆవేశాన్ని మరికొన్ని సందర్భాల్లో ఓర్పును ప్రదర్శిస్తూ ఏపీ రాజకీయాల్లో తన పేరు మారుమ్రోగేలా చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆ సవాళ్లను అధిగమిస్తూ సత్తా చాటే విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
 
ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ 2014లో జనసేన పేరుతో పార్టీ స్థాపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చాలా సందర్భాల్లో చెప్పిన పవన్ అలా చేయడంలో సక్సెస్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్ టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
 
ఏపీలో 164 స్థానాల్లో కూటమి విజయం సాధించడం కోసం ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు. 21 స్థానాల్లోనే జనసేన పోటీ చేసినా పవన్ కళ్యాణ్ అంచనాలను మించి ఫలితాలను సాధించారు. పిఠాపురంలో పవన్ శక్తికి వర్మ యుక్తి తోడై అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని కలలు కన్న ఫ్యాన్స్ ఆ కల నిజం అయినందుకు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో విజయం సాధించిన పవన్ భవిష్యత్తులో జనసేన పార్టీని రాష్ట్రవ్యాప్తంగా గెలిపించి సీఎం అవుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: