ఎన్డీఏ కూటమికి సపోర్ట్‌ చేయడంపై.. బాబు షాకింగ్ నిర్ణయం ?

Veldandi Saikiran
భారత దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్డీఏ కూటమి (బీజేపీ) కి ఊహించని పరిణామం..ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో చోటు చేసుకుంది. అనూహ్యంగా పుంజుకున్న ఇండియా కూటమి....భారీగా సీట్లను కైవసం చేసుకుందని చెప్పవచ్చును. నేషనల్ ఛానల్స్ ఇచ్చిన సర్వే లన్నీ తలకిందులు చేస్తూ.... ఇండియా పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమికి 350 నుంచి 400 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి నేషనల్‌ చానల్స్‌. కానీ పరిస్థితి పూర్తిగా రివర్స్‌ అయింది. 

ప్రస్తుతం 300 మార్క్ కూడా దాటే పరిస్థితి కనిపించని పరిస్థితి నెలకొంది. ఇండియా కూటమికి ఇప్పటికే 199 స్థానాలు వచ్చాయి. అటు ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు దక్కాయి. అయితే.. చంద్రబాబు, నితీష్‌ కుమార్‌ బయటకు వస్తే.. మోడీ సర్కార్‌ ఏర్పాటు కావడం కష్టం. అయితే.. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. తమ సపోర్ట్‌ ఎన్డీఏ కూటమికి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్ గెలిచిందని... ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గెలిచారన్నారు. ఇవాళ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందని పేర్కొన్నారు.

టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి సేవ చేసేందుకు అఖండమైన ఆదేశంతో ఆశీర్వదించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు బాబు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం జరిగిన యుద్దంలో గెలిచామని... కలిసికట్టుగా రాష్ట్ర పునర్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఏపీ భవిష్యత్తు కోసం మేమున్నామని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ,  అమిత్‌షా జీ, జేపీ నడ్డాకు  ధన్యవాదాలు...అంటూనే వారికి అండగా ఉంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్, పురందేశ్వరి జనసేన, బీజేపీ శ్రేణులకు అభినందనలు తెలిపారు.

ఈ మహత్తర విజయం కూటమి నాయకులు, కార్యకర్తల కృషి,  అంకితభావం వల్ల సాధ్యమైంది....చివరి ఓటేసే వరకు ధైర్యంగా పోరాడారన్నారు. కూటమి కాక్యకర్తలు, నేకల అచంచలమైన నిబద్ధతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. దీంతో ఎన్డీఏ కూటమికి బాబు సై అన్నారని అందరూ చెబుతున్నారు. ఇక ఇవాళ ఇందులో భాగంగానే ఢిల్లీకి పవన్‌, బాబు వెళుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: