వైసీపీ టోటల్‌గా గెలిచిన సీట్లు ఎన్నంటే..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. వై నాట్ 175 అని మొత్తం అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటానని ధీమాతో జగన్ ఈసారి బరిలో దిగారు. అయితే ఆయన ఊహించిన దానికి పూర్తి రివర్స్ లో ఫలితాలు వచ్చాయి. దీనివల్ల రిజల్ట్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని జగన్ కూడా బాగా డిస్పాండ్ అవుతూ నిన్న మాట్లాడారు. ఈసారి ఆయన పార్టీ జస్ట్ 11 స్థానాలకే పరిమితం కావడం విస్మయకరం.
పులివెందుల నియోజవకర్గంలో కూడా జగన్‌కు మెజార్టీ 30-40 వేల రేంజ్ లో తగ్గింది. జగన్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప వైసీపీ కేబినెట్‌లోని మంత్రులందరూ చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఒకసారి వైసీపీ గెలిచినా 11 స్థానాలేవో తెలుసుకుందాం.
* వైసీపీ గెలిచిన 11 అసెంబ్లీ స్థానాలు..
* పులివెందులలో 61,687 ఓట్ల మెజార్టీతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గెలుపొందారు.
* బద్వేలులో 18,567 ఓట్ల మెజార్టీతో దాసరి సుధ ఘన విజయం సాధించారు.
* పుంగనూరులో 6,095 ఓట్ల మెజార్టీతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గెలిచారు.
* మంత్రాలయంలో 12,805 ఓట్ల మెజార్టీతో వె.బాలనాగిరెడ్డి విన్ అయ్యారు.
* ఆలూరులో 2,831 ఓట్ల మెజార్టీతో బూసినే విరూపాక్షి గెలిచారు.
* యర్రగొండపాలెం (ఎస్సీ)లో 5,200 ఓట్ల మెజార్టీతో తాటిపత్రి చంద్రశేఖర్‌ విన్ అయ్యారు.
* అరకు (ఎస్టీ)లో 31,877 ఓట్ల మెజార్టీతో రేగం మత్స్యలింగం విజయం సాధించారు.
* పాడేరు (ఎస్టీ)లో 19,338 మత్స్యరాస విశ్వేశ్వరరాజు
* రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి 7,016 ఓట్ల మార్జిన్ తో విన్ అయ్యారు.
* తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి (10,103 ఓట్ల మెజార్టీ) గెలుపు
* దర్శిలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి (2,456 ఓట్ల మెజార్టీ) గెలుపు.

పైన చూసుకుంటే జగన్, బాల నాగిరెడ్డి, రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి.. ఐదుగురు మాత్రమే పదివేల కంటే ఎక్కువ మెజార్టీ సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: