మోడీ దూకుడు: సీట్లు తక్కువ వచ్చినా తగ్గడం లేదుగా ?

Veldandi Saikiran

భారతదేశ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అలాగే సర్వే సంస్థలు చెప్పినట్లుగా వారు వన్ సైడ్ గా కనిపించడం లేదు. ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చిందని స్పష్టంగా అర్థం అవుతుంది. ఎక్కడ కూడా తగ్గకుండా.. అడుగడుగునా బిజెపి  పార్టీలకు చుక్కలు చూపించింది ఇండియా కూటమి.
 ఇప్పటివరకు ఉన్న ట్రెండు ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి 292 స్థానాలు దక్కేలా కనిపిస్తున్నాయి.  అటు ఇండియా కూటమికి 234 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ పార్టీల సహాయంతో...  కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పాటు కావడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది ఎన్ డి ఏ కూటమి.
 సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా... కూటమి పార్టీలతో బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. గతంలో 303 సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ పార్టీ...  పూర్తిగా ఎక్కడ ప్రభావం కనిపించలేదు. ఎవరు ఊహించని ఫలితాలు బిజెపికి వచ్చాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయబోతుంది. ఇలాంటి నేపథ్యంలోనే దేశ ప్రజలను ఉద్దేశించి... ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
 లోక్సభ ఎన్నికల ఫలితాలపై... ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారతదేశ ప్రజలందరూ వరుసగా మూడోసారి ఎన్డీఏ కూటమిని విశ్వసించారని ఆయన తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం అంటూ వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి గత పది సంవత్సరాలలో చేసిన మంచి పనిని ఇంకా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ విజయం కోసం ఎంతో కృషి చేసిన బిజెపి కార్యకర్తలకు అలాగే పార్టీ నేతలకు నేను సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. వారిని అభినందిం చేందుకు మాటలు చాలా వంటూ ఎమోషనల్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: