విజయనగరం అసెంబ్లీలో వైసీపీపై సూపర్ విక్టరీ సాధించిన విజయలక్ష్మి..!

Pulgam Srinivas
మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు జూన్ 4 వ తేదీన అనగా ఈ రోజు విడుదల అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మే 13 వ తేదీ తర్వాత ఎప్పుడెప్పుడు ఎన్నికల ఫలితాలు వస్తాయా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాయకులు , కార్యకర్తలతో పాటు జనాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుండే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. కట్టు దిట్టమైన చర్యల మధ్య మొదలైన ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఎలాంటి ఘటనలు లేకుండా చాలా సాఫీగా జరుగుతుంది.

ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి. అందులో భాగంగా తాజాగా విజయనగరం జిల్లాలోని విజయనగరం నియోజకవర్గనికి సంబంధించిన ఫలితం కూడా వచ్చేస్తుంది. ఇకపోతే ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా కొలగట్ల వీరభద్ర స్వామి బరిలో ఉండగా , కూటమి అభ్యర్థిగా అదితి గజపతిరాజు బరిలో ఉన్నారు. ఇకపోతే 2004 వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో కొలగట్ల వీరభద్ర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి గెలిచారు. ఆ తర్వాత 2019 వ సంవత్సరం వై సీ పీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వీరభద్ర స్వామి మరోసారి ఈ ప్రాంతం నుండి గెలిచారు.

ఇక ఈ ప్రాంతం నుండే 2004 , 2019 వ సంవత్సరాలలో గెలిచి ఎమ్మెల్యే అయిన ఈయనను మరోసారి నమ్మి వై యస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత ఎమ్మెల్యే సీటును ఇచ్చారు. ఇక ఈయన ఇప్పటికే ఈ ప్రాంతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండడంతో ఈ ప్రాంతంలో ఇతనికి అద్భుతమైన పట్టు ఉంది. ఇక ఈ సారి టిడిపి , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేయడంతో అదితి విజయలక్ష్మి గజపతి రాజు కు కూడా ఈ మూడు పార్టీల అనుకూల ఓట్లు పడే అవకాశం భారీగా ఉంది. దానితో ఈయన కూడా వీరభద్ర స్వామి కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది అని ఇక్కడి జనాలు ఎంతగానో భావించారు. కానీ ఇక్కడ వార్ వన్ సైడ్ గానే నడిచింది. మొదటి నుండి కూడా విజయలక్ష్మి భారీగా ఓట్లను తెచ్చుకుంది. దానితో ఈమె ఇక్కడ తన సమీప అభ్యర్థి అయినటువంటి వైసీపీ పార్టీ నేత వీరభద్ర స్వామి పై విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: