మోడీ : బీజేపీకి హ్యాండిస్తున్న టీడీపీ, జేడీయూ...?

Veldandi Saikiran
భారతదేశ రాజకీయాలలో.... పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన అధికారం వచ్చేలా కనిపించడం లేదు. 2019, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి స్పష్టమైన మెజారిటీని సంపాదించుకొని... ఇండియా కూటమి సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆ పరిస్థితి లేదని స్పష్టం అవుతుంది. దీనికి కారణం ప్రస్తుతం వస్తున్న రిజల్ట్స్.
 ఇవాళ ఉదయం నుంచి ఇప్పటివరకు... దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇస్తోంది ఇండియా కూటమి. ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్లుగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ లెక్కల ప్రకారం ఎన్డీఏ కూటమి... 294 సీట్లతో  ముందంజలో ఉంది. అటు ఇండియా కూటమికి  232 స్థానాలు  వచ్చేలా కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి  పార్టీలన్నీ కలిస్తే...  ప్రభుత్వం ఏర్పాటు చేయడం మోడీకి చాలా సులువు అవుతుంది.
 అయితే ఒకవేళ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు బయటకు వస్తే... బిజెపికి ప్రమాదం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బిజెపి పార్టీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ఎక్కడ కూడా దాటినట్లు కనిపించడం లేదు. దీంతో ఎన్డీఏ కు టిడిపి, జెడియు... ఒకవేళ హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో అలాగే రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి చేతిలో 294 సీట్లు ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఇందులో సొంతంగా 243 అని తెలుస్తోంది.
 ఇండియాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి... 272 ఎంపీ స్థానాలు కావాలి. అయితే ఇప్పటివరకు ఉన్న 294 సీట్లలో.. తెలుగుదేశం పార్టీ మరియు జేడీయు పార్టీలు పక్కకు జరిగితే...మరింత తగ్గుతుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 16 ఎంపీ స్థానాలు, అలాగే జేడీయుకు 12 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు పక్కకు జరిగితే బిజెపికి 266 మాత్రమే మిగులుతాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 272 కావాలి. నిజంగానే టిడిపి అలాగే జెడియు పక్కకు జరిగితే బిజెపికి చాలా ప్రమాదం అని విశ్లేషకులు చెబుతున్నారు.మరి ఈ రెండు పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: