పలాసలో టీడీపీ అభ్యర్థి గౌత శిరీష ప్రభంజనం..!

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఎలక్షన్ల హడావిడి మొదలు అయింది. ఇక ఎలక్షన్ల షెడ్యూల్ ఎప్పుడు అయితే విడుదల అయ్యిందో అప్పటి నుండి రాష్ట్రంలో ఎన్నికల హేట్ మరింత ముదిరిపోయింది. ఇక దాదాపు రెండు , మూడు నెలల హోరా హోరీ ప్రచారాల తర్వాత మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

ఇక ఈ ఎన్నికలలో ప్రస్తుత అధికార పార్టీ వై సి పి ఒంటరిగా పోటీలోకి దిగగా , తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు అనగా జూన్ 4 వ తేదీన విడుదల అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చిన్న నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలను ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని పలాస శాసన సభ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాన్ని కూడా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాంతం నుండి వై సీ పీ పార్టీ అభ్యర్థిగా సిధరి అప్పలరాజు పోటీలో ఉండగా , కూటమి అభ్యర్థిగా గౌతు శిరీష బరిలో ఉంది. ఇక వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది అని మొదటి నుండే ఇక్కడి ప్రజలు వై సి పి , కూటమి కార్యకర్తలు భావిస్తూ వచ్చారు.

కాకపోతే మొదటి నుండి ఇక్కడ టిడిపి పార్టీ అభ్యర్థి ఫుల్ జోష్ ని చూపిస్తూ వచ్చింది. దానితో ఈ ప్రాంత టిడిపి అభ్యర్థురాలు అయినటువంటి గౌతు శిరీష ఏకంగా 101560 ఓట్లను సాధించింది. ఇక వైసిపి అభ్యర్థి అయినటువంటి అప్పలరాజు సీరిడి 61210 ఓట్లను సాధించాడు. దానితో అప్పలరాజు పై శిరీష 40350 ఓట్ల భారీ మెజారిటీతో పలాస నియోజక వర్గం లో గెలుపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: