పవన్ కళ్యాణ్ విజయంతో బన్నీ గుండెల్లో దడ.. యమ అర్జెంటుగా ట్వీట్..??

Suma Kallamadi
నేడు ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని చాలామంది భావించారు కానీ ఈసారి వైసీపీ తుస్సుమనిపించింది. కనీసం 15 సీట్లు కూడా గెలుచుకోవడానికి కష్టపడుతోంది. 150-175 సీట్లతో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ అన్నారు కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాకి సరిపడా సీట్లను కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది.
18 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటే వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిపోయేది కానీ ఇప్పుడు ఆ హోదాను కోల్పోయింది. జనసేన మాత్రం 21 చోట్ల పోటీ చేసి 21 చోట్ల కూడా గెలిచింది. దాంతో ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదిగింది. రెండు సీట్లు కూడా గెలుచుకోలేని జనసేన పార్టీ ఎందుకు? అనే అవహేళన చేసిన వారందరి నోళ్ల ను ఈ రిజల్ట్ తో ఆ పార్టీ మూయించింది.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈసారి టీడీపీ కూటమి రాదని భావించినట్టు ఉన్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన వాడైనా అల్లు అర్జున్ పవన్ కోసం ఎలాంటి ప్రచారాలు చేయలేదు. ఒక ట్వీట్ చేసి పవన్ కు సపోర్ట్ చేయాలని కోరారు తప్ప రామ్ చరణ్ వలే ప్రత్యక్షంగా పిఠాపురం వెళ్లి ప్రచారం చేసింది లేదు. సొంత మామ కోసం ప్రచారం చేయలేదు కానీ తన ఫ్రెండు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారానికి మాత్రం సతీసమేతంగా వెళ్లాడు. బహిరంగంగా మద్దతు తెలిపాడు. కానీ కట్ చేస్తే రవిచంద్ర ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ మాత్రం గెలిచేసాడు. దాంతో బన్నీకి ఒక షాక్‌ తగిలినట్లు ఉంది. తాను కావాలనే వైసీపీకి మద్దతు ఇచ్చాడు, జనసేనకు మాత్రం దూరంగా ఉన్నాడు.
బన్నీ సపోర్టు లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని నమోదు చేశారు. దాంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖం చిన్నబోయినట్లుంది. ఇక చేసేదేమీ లేక ఆయన వెంటనే పవన్ కళ్యాణ్ గురించి ఒక ట్వీట్ చేశాడు. ‘సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం, నిబద్దత ఎలప్పుడూ తన హృదయాన్ని హత్తుకున్నాయి. ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని బన్నీ పవన్ కు విషెస్ చెప్పాడు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: