తెనాలి: జనసేనకే జై కొట్టిన ప్రజలు..ఫ్యాన్ రెక్కలు వక్కలైపోయాయిగా..!!

Pandrala Sravanthi
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరో ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గాల్లో తెనాలి కూడా ఒకటి.  ఈ నియోజకవర్గానికి రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరు ఉంది. అలాంటి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి హేమాహేమీలు పోటీ చేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  నాదెండ్ల మనోహర్.  ఈయన జనసేన పార్టీ నుంచి బరిలో ఉండగా ఈయనకు ప్రత్యర్థిగా వైసిపి నుంచి అన్నబత్తుని శివకుమార్ బరిలో ఉన్నారు.  ఈసారి కాంగ్రెస్ కూడా అక్కడ బలమైన పోటీ ఇస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,66,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,28,000 , మహిళా ఓటర్లు 1,37,000. ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. 

అలాంటి తెనాలి వెండి, బంగారు ఆభరణాలు తయారీకి ప్రసిద్ధిగాంచింది. తెనాలిలో మూడుసార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు కాంగ్రెస్ ఐ, నాలుగుసార్లు టిడిపి, రెండుసార్లు  సిపిఐ ఒకసారి వైసిపి పార్టీలు విజయం సాధించాయి. ఇక 2019లో అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ నుంచి ఘనవిజయం పొందారు. ఈయనకు సమీప అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ టిడిపి నుంచి పోటీ చేశారు. ఇక జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కూడా గట్టి పోటీ ఇచ్చారు. అలాంటి తెనాలి నియోజకవర్గంలో ఈసారి కూటమి అభ్యర్థిగా మనోహర్ వైసీపీ నుంచి  శివకుమార్ ,   కాంగ్రెస్ నుంచి షేక్ బషీర్ పోటీ చేస్తున్నారు.

అలాంటి ముగ్గురు ఉద్దండ నేతల మధ్య జరిగినటువంటి ఈ పోరులో ఈరోజు ఎవరు గెలవబోతున్నారు ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి  అనే వివరాలు చూద్దాం. తెనాలి నియోజకవర్గంలో  జనసేన నుంచి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్  మొత్తం 22 ముగిసేసరికి  అత్యధిక మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు ఆయనకు 1,21491 ఓట్లు పడ్డాయి. ఇక సమీప వైసీపీ అభ్యర్థి అన్నా భక్తుల శివకుమార్ కు 74,510 ఓట్లు వచ్చాయి. ఇదే తరుణంలో జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 46,981 ఓట్ల మెజార్టీతో  ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్నారు. దాదాపుగా ఆయనకు 50 వేల మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: