సాలూరు : 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నేతను ఓడించేసిన సంధ్యారాణి..!

Pulgam Srinivas
ఈ రోజు ఉదయం నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. అందులో భాగంగా ఎలక్షన్ సంఘం ఎలాంటి ఘర్షణ సంఘటనలు లేకుండా చాలా శాంతి యుతంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళుతుంది. ఇక ఉదయం 6 గంటలకు ప్రారంభం అయిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం చాలా సజావుగా జరుగుతూ ఉండడంతో ఇప్పటికే చాలా ప్రాంతాలకు సంబంధించిన ఫలితాలు వచ్చేసాయి. ఇక తాజాగా సాలూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల ఫలితాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.

ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పిడక రాజన్న దొర బరిలో ఉండగా , కూటమి అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణి బరిలో ఉంది. ఇకపోతే 2009 వ సంవత్సరం పిడక రాజన్న దొర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ప్రాంతం నుండి పోటీ చేశారు. ఇక ఆ ఎన్నికలలో ఈయన గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత జరిగిన 2014 వ సంవత్సరం ఎన్నికలలో ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దిగి మరోసారి గెలుపొందారు. ఇకపోతే 2019 వ సంవత్సరం కూడా ఈయన వైసీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ముచ్చటగా మూడవ సారి గెలిచారు. ఇలా వరుసగా మూడు సార్లు ఈ ప్రాంతం గెలిచిన ఈయనకు ఈ ప్రాంతంలో అద్భుతమైన పట్టు ఉంది.

అలాగే ప్రస్తుతం అధికార పార్టీ అభ్యర్థి కావడం , సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కావడంతో ఈయనకు కేడర్ కూడా బలంగానే ఉంది. దానితో మొదటి నుండి వరుసగా మూడు సార్లు విజయం సాధించిన రాజన్న దొర మీద గెలవడం అంటే గుమ్మడి సంధ్యారాణి కి కష్టమే అని ఇక్కడ ప్రజలు భావిస్తూ వచ్చారు. కానీ సంధ్యారాణి ఇక్కడ ఓట్ల లెక్కింపు మొదలు పెట్టినప్పటి నుండి జోష్ ను చూపించడం మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈమె 78,872 ఓట్లను తెచ్చుకుంది. ఇక రాజన్న దొరకు 65,814 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మువ్వల పుష్ప రావుకి 2225 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక సాలూరు లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సంధ్యారాణి , వైసిపి పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజన్న దొరపై 13058 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: