ఒడిశా: నవీన్ పట్నాయక్‌ కోట కూల్చేసిన బీజేపీ?

Veldandi Saikiran

ఇండియా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగగా... ఆయా రాష్ట్రాలలో కూడా ఫలితాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పకూలించింది ఎన్డీఏ కూటమి. ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ కోటను బద్దలు కొట్టుతోంది  బిజెపి పార్టీ.
 వరుసగా ఆరవ సారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలని.. ఎంతో ఆశగా ఉన్న సీఎం నవీన్ పట్నాయక్.. ఆశలను గల్లంతు చేసింది బిజెపి పార్టీ. ఒడిస్సా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా.... అడుగులు వేస్తోంది ఈ భారతీయ జనతా పార్టీ. ఒడిస్సా రాష్ట్రంలో అధికార బీజేడీ పార్టీని వెనక్కి నెట్టి... ఆ రాష్ట్రంలో లీడ్ ను ప్రదర్శిస్తోంది బిజెపి పార్టీ.
 ఒడిస్సా రాష్ట్రంలో 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్థానాలలో.... భారతీయ జనతా పార్టీ మెజారిటీ మార్కును కాసేపటికి క్రితమే దాటేసింది భారతీయ జనతా పార్టీ. ఒడిశా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 74 సీట్లు అవసరం. అంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 74 అసెంబ్లీ స్థానాలు కావాలన్నమాట. అయితే ఇప్పటికే కమలం పార్టీ అక్కడ 78 స్థానాల్లో... భారతీయ జనతా పార్టీ ఆదిత్యంలో ఉంది.
 ఈ అటు బి జె డి  పార్టీకి 54 స్థానాలు మాత్రమే దక్కేలే కనిపిస్తున్నాయి. స్వతంత్రులు రెండు స్థానాలలో ముందంజలో ఉన్నారు. అంతేకాదు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఒక స్థానంలో వెనుకంచి లో ఉన్నారు. కాంతా బంజి  స్థానం నుంచి నవీన్ పట్నాయక్ పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ నవీన్ పట్నాయక్ పై... బిజెపి అభ్యర్థి లీడ్ ప్రదర్శించడం మనం చూస్తున్నాం. కానీ హింజిలి అసెంబ్లీ స్థానంలో మాత్రం... సీఎం నవీన్ పట్నాయక్ ముందంజలో ఉన్నారు. ఈసారి ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: