సీఎంకే షాకిచ్చిన బీజేపీ.. రేవంత్ ఇలాకలో వికసిస్తున్న కమలం?

praveen
అందరూ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది.  పార్లమెంట్ ఎన్నికల  కౌంటింగ్ పటిష్ట బందోబస్తు మధ్య ప్రారంభమైంది.  ఈ క్రమంలోనే ఏ పార్టీకి ఆదిక్యం వస్తుంది అనే విషయంపై ఉత్కంఠ పెరిగిపోతుంది.. ఇటీవల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్లలో ఎవరికి ఆదిక్యం వస్తుంది అనే విషయంపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అసలు కౌంటింగ్ కి ముందు మూడు రోజుల క్రితం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో బిజెపి ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లలో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి .

 ఇక ఇప్పుడు చెప్పినట్లుగానే ప్రస్తుతం తెలంగాణలో మంచి ఆదిక్యత్యతో బిజెపి దూసుకుపోతుంది. అక్కడ ఇక్కడ కాదు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలోనే బిజెపి పార్టీ లీడింగ్ లోకి వచ్చింది. అయితే సొంత జిల్లాలో గెలుపును ఎవరైనా సరే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కానీ అటు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాగా పిలుచుకునే మహబూబ్నగర్లో ప్రస్తుతం బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన బిజెపి ఇక ఇప్పుడు మాత్రం మొదటి స్థానంలోకి దూసుకొచ్చేసింది.

 కాగా మహబూబ్నగర్లో ప్రస్తుతం బిజెపి అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థులపై పై చేయి సాధించి దూసుకుపోతున్నారు. అయితే కేవలం అటు మహబూబ్నగర్లోనే కాదు రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో కూడా బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఏకంగా 20 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఇలా సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో మాత్రమే కాదు సీఎం సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి లో కూడా కమలం వికసిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సొంత ఇలాకాలను కూడా కాపాడుకోలేకపోతున్న రేవంత్.. విమర్శలు ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: