గుడివాడలో వైసిపికి భారీ దెబ్బ..!

Pulgam Srinivas
వైసిపి పార్టీలో కీలక వ్యక్తి అయినటువంటి కొడాలి నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన గుడివాడ నియోజకవర్గం నుండి మొదటి సారి 2004 వ సంవత్సరం టి డి పి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక మొదటి సారి ఈయన అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 2009 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈయన టి డి పి అభ్యర్థిగా బరిలోకి దిగి రెండవ సారి కూడా గెలుపొందారు.

ఇక ఆ తర్వాత ఈయన వై సి పి పార్టీలోకి మారారు. ఇక వై సి పి పార్టీలోకి మారిన తర్వాత కూడా ఈయన ఈ ప్రాంతం నుండి 2014 వ సంవత్సరం పోటీ చేసి భారీ స్థాయి విజయం అందుకున్నాడు. ఇక 2019 వ సంవత్సరం కూడా ఈ ప్రాంతం నుండి బరిలోకి దిగి 4 వ సారి కూడా విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఈయన ఐదవ సారి అనగా 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ ప్రాంతం నుండి బరిలోకి దిగారు. కానీ ఈ సారి ఈయన గెలవడం కష్టమే అని మొదటి నుండి కొంత మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక ఈ ప్రాంతం నుండి టి డి పి పార్టీ అభ్యర్థి అయినటువంటి వెనిగండ్ల రాము బరిలో ఉన్నారు.

ఇకపోతే టిడిపి ఈ సారి జనసేన , బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం తో రాముకు టిడిపి అనుకూల ఓట్లతో పాటు జనసేన , బీజేపీ అనుకూల ఓట్లు కూడా పడే అవకాశం ఉండడం వల్ల ఈయన గెలుస్తారు అని చాలా మంది భావించారు. ఇకపోతే ఈ రోజు ఉదయం నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయిన విషయం మన అందరికీ తెలిసిందే. మొదటి రౌండ్ ఫలితాలు వచ్చే సరికి అందరూ ఊహించినట్టే కొడాలి నాని పై వెనిగండ్ల రాము లీడ్ ను సాధించారు. ఎంత లీడ్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ లీడ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా..? లేక నాని ముందుకు వస్తారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: