నెల్లూరు సిటీ : పోస్టల్ బ్యాలెట్ లో దూసుకెళ్తున్న నారాయణ

murali krishna
దేశవ్యాప్తంగా ఎన్నిక ల కౌంటింగ్ మొదలైంది.ప్రస్తుతం దేశ ప్రజలంతా ఎన్నికల ఫలితాల కోసం ఎంత గానో  ఎదురు చూస్తున్నారు.ఎన్నికల ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీల అన్నిటి లో టెన్షన్ మొదలైంది. నెల్లూరు సిటీ ఎవరి ఖాతాలో పడుతోందో అంటూ ప్రజలు ఎంతో  ఆసక్తి గా గమనిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థి గా పి నారాయణ,ఖలీల్ అహ్మద్  వైసీపీ అభ్యర్థి గా  పోటీ చేశారు.అయితే వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ కేడర్‌పైనే కాకుండా సొంత పార్టీ నేతలపైనా కూడా కక్షసాధింపులకు పాల్పడినట్లు సమాచారం.వైసీపీ ముఖ్య నాయకులందరూ పార్టీకి దూరమయ్యారు. అభివృద్ధి చేయకపోగా నగరంలో శాంతిభద్రతల సమస్య సృష్టించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనిని గుర్తించిన అధిష్ఠానం అనిల్‌ ను తప్పించి.. ఆయన అనుచరుడైన డిప్యూటీ మేయర్‌ ఖలీల్‌ అహ్మద్‌ కు టికెట్‌ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రం గా నిరసిస్తున్నాయి. టీడీపీ లోకి వలసబాట పట్టారు.దీనితో ఈ సారి వైసీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది.


నెల్లూరు సిటీ  నియోజకవర్గం ఇప్పుడు ఎంతో ప్రత్యేకత కలిగి వుంది.తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు కార్యక్రమం మొదలైంది దీని తో ఈ సారి ఎవరు గెలుస్తారో అని ఆసక్తి  మొదలైంది.టీడీపీ అభ్యర్థి నారాయణ వైసీపీ అభ్యర్థిపై ముందంజ లో వున్నారు.దీనితో ఈ సారి టీడీపీ గెలవడం ఖాయం గా కనిపిస్తుంది.తాజాగా  వచ్చిన సర్వే లు అన్ని కూడా టీడీపీ కి అనుకూలంగా వచ్చాయి.దీని తో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ ఆధిక్యం సాగిస్తుంది.దీనితో ఈ సారి టీడీపీ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.ప్రస్తుత పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ దూసుకుపోతుంది.దీనితో ఈసారి టీడీపీ గెలుపు పక్కా అని టీడీపీ కార్యకర్తలు ,అభిమానులు ధీమాగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: