విజయనగరం జిల్లాలో లీడ్ ఖాతా ఓపెన్ చేసిన టీడీపీ..!

Pulgam Srinivas
మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి . ఇక పోతే ఈ రోజు ఉదయం నుండే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. అందులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇక ఆ తర్వాత ఈవీఎం ఓట్లను కూడా లెక్కించడం మొదలు పెట్టారు.

ఇకపోతే ఇందులో భాగంగా గజపతినగరం లో కూడా ఇప్పటికే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. అందులో భాగంగా టి డి పి అభ్యర్థి అయినటువంటి కొండపల్లి శ్రీనివాస్ ఆధిక్యం లో కొనసాగుతున్నాడు. ఇక ఈ ప్రాంతం నుండి వై సీ పీ పార్టీ అభ్యర్థిగా బొత్స అప్పల నరసయ్య బరిలో ఉండగా , కూటమి అభ్యర్థిగా కొండుపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఇక మొదటి నుండి కూడా బొత్స అప్పల నరసయ్య , కొండపల్లి శ్రీనివాస్ మధ్య భారీ ఉంటుంది అని జనాలు అంతా భావించారు. అలాగే మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు కాబట్టి ఇవి ప్రభుత్వ ఉద్యోగులు వేస్తారు.

ఎలాగో వై సి పి పార్టీ పై ప్రభుత్వ ఉద్యోగులు కాస్త నెగిటివ్ గా ఉండడంతో మొదటి రౌండ్ లో వైసీపీ పార్టీకి వ్యతిరేకం గానే ఉంటుంది అనే సంకేతాలు మొదటి నుండి వచ్చాయి. అందుకు అనుగుణం గానే గజపతినగరం లో మొదటి రౌండ్లు పూర్తి అయ్యే సరికి టి డి పి అభ్యర్థి అయినటువంటి కొండపల్లి శ్రీనివాస్ 1600 ఓట్ల ఆధిక్యంతో లో ఉన్నారు. మరి ఈ ఆధిక్యం ఇలాగే కొనసాగుతుందా..? లేక వచ్చే రౌండ్లలో ఈయనను వెనక్కి నెట్టేసి బొత్స అప్పల నరసయ్య ముందుకు వస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: