పల్నాడు : కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఏజెంట్ కు గుండెపోటు..!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ లో మే 13న జరిగిన ఎలక్షన్స్ రసవత్రంగా జరిగాయి.ప్రతిచోట అభ్యర్థులు నువ్వా-నేనా అన్నట్లు ఒకరిమీద ఒకరు హోరహోరిగా పోటీపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలో పోలిస్తే పెరిగింది. గడిచిన రెండు దశాబ్దాలుగా ఏపీలో ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం లో పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది.ఆధికారిక లెక్కల ప్రకారం, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 69.9% మంది ఓటు వినియోగించుకున్నారు.ఆ తర్వాత ఐదేళ్లకు 2009లో అది 72.7% కి పెరిగింది. అంటే, 2.8 శాతం మంది ఓటర్లు అదనంగా ఓటు వేశారు.ఇక 2014 లెక్కల ప్రకారం పోలింగ్ శాతం 78.4 శాతంగా ఉంది. అంటే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే ఒకేసారి అనూహ్యంగా 5.7 శాతం పెరుగుదల నమోదైంది.ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 79.77 శాతానికి పెరిగింది. అంతకుముందు పదేళ్ల కిందట జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఇది 7 శాతం అదనం.ప్రస్తుత ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది.ఒకవైపు వైసీపీ మరోవైపు టిడిపి పెరిగిన ఈ పోలింగ్ శాతం ఆధారం చేసుకుని గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ప్రధాన పార్టీ అధినేతలు పోలింగ్ కేంద్రాల వద్ద వెళ్లే ఏజెంట్లకు రెండు రోజుల క్రితమే దిశా నిర్దేశం చేశారు.
అయితే అందులో భాగంగానే పల్నాడు లోని నరసరావుపేట,చిలకలూరిపేట నియోజకవర్గం సంబంధించి పోలింగ్ కేంద్రం గా ఉన్న కాకాని జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్‌కు గుండెనొప్పి చిలకలూరిపేట నియోజకవర్గ కౌంటింగ్ ఆరో టేబుల్ వద్ద ఉన్న తెదేపా ఏజెంట్ రమేష్ గుండెనొప్పి రావడంతో వెంటనే 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.దాంతో ఆ కేంద్రం వద్ద టీడీపీ నేతలు ఆ ఏజెంట్ స్థానంలో వేరే వారి నియమించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: