కేసీఆర్‌ చేతిలో ఓటమి...సెక్రటేరియట్ వాస్తు సెట్‌ చేస్తున్న రేవంత్‌ ?

Veldandi Saikiran
కేసీఆర్‌ బాటలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి నడుస్తున్నాడా? కేసీఆర్‌ కు ఉన్న వాస్తు పిచ్చి ఇప్పుడు రేవంత్‌ రెడ్డికి కూడా పట్టిందా ? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. కేసీఆర్‌ సర్కార్‌ హాయంలో కట్టిన తెలంగాణ సెక్రటేరియట్ లో పెను మార్పులు చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సిద్ధం అయ్యారట. ఈ మేరకు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నార తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.

 
తెలంగాణ సెక్రటేరియట్ లో వాస్తు మార్పులు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారట సీఎం రేవంత్‌. ప్రస్తుతం వాస్తు పరిస్థితులు... కాంగ్రెస్‌ పార్టీకి, రేవంత్‌ కు అనుకులంగా లేవని కొంత మంది జ్యోతిష్యులు చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే.. తెలంగాణ సెక్రటేరియట్ లో వాస్తు మార్పులు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మొన్నటి వరకు తెలంగాణ సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాన్వాయ్ వచ్చేది.

 
కానీ ఇకపై కీలక మార్పులు జరుగనున్నాయి. ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ గుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాన్వాయ్ వెళ్లేలాగా ప్లాన్‌ చేస్తున్నారట. ఆ దిశగా వాస్తు మార్పులు కూడా చేస్తున్నారట. ఇక సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారుల రాకపోకలు ఉండేలా సెట్‌ చేస్తున్నారట అధికారులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి... మొదటిసారి వాస్తు మార్పులు చేయిస్తున్నారు.

 
తెలంగాణ సెక్రటేరియట్ లో గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంను ఆరో అంతస్థులో ఉంచారు. కానీ ఇప్పుడు తొమ్మిదో అంతస్థుకు ముఖ్యమంత్రి కార్యాలయంను మార్చాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం తొమ్మిదో అంతస్థులో పనులు కూడా జోరుగా సాగుతున్నాయని టాక్‌. సెక్రటేరియట్ లోపల మరికొన్ని మార్పులు - చేర్పులు చేయిస్తున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం...మరో నెల రోజుల్లోనే పూర్తి చేయనుందట. అయితే...రేవంత్‌ రెడ్డి సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఓడిపోయిన తరుణంలో తెలంగాణ సెక్రటేరియట్ లో వాస్తు మార్పులు చేస్తున్నారని కొంత మంది ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: